నేడు జనహృదయ నేత ‘వై.ఎస్‌.ఆర్‌` ప్రథమ వర్ధంతి

  • ఇడుపులపాయకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు

DSC_1413

రాష్టవ్య్రాప్తంగా వైఎస్‌కు ఘన నివాళి
దివంగత సిఎం, ప్రియతమ నేత డా. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఘన నివాళులర్పించారు. రాష్టవ్య్రాప్తంగా వైఎస్‌ వర్థంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ కార్యకర్తలు నివాళులర్పించారు. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్‌ చిత్రపటానికి మంత్రులు నివాళులర్పించారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఉన్నంతవరకూ కొనసాగిస్తుందని మంత్రులు సబితాఇంద్రారెడ్డి, దానం నాగేందర్‌లు తెలిపారు.
వైఎస్‌తో కలిసి పనిచేయడం మరువలేనిది – రోశయ్య
ఆత్మీయుడు వైఎస్‌ఆర్‌ వర్థంతికి వెళ్లాలని ఉన్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో వెళ్లలేకపోయినందుకు ఎంతో బాధగా ఉందని సిఎం రోశయ్య అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధం, ఆత్మీయతను రోశయ్య నెమరు వేసుకున్నారు. వైఎస్‌ స్మృతి నిత్యనూతనమని, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు జనంలో ఎప్పుడూ పచ్చగానే ఉంటాయని సిఎం అన్నారు. అలాంటి మహానేత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిన్నట్లు ఆయన చెప్పారు. వైఎస్‌ ప్రతమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు రోశయ్య తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
వైఎస్‌ రాజేశఖర్‌తో అనుబంధం ఎంతో గొప్పది -  గీతా రెడ్డి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డితో ఉన్న అనుబంధం, ఆత్మీయతను మంత్రి గీతా రెడ్డి నెమరు వేసుకున్నారు. ఆయనతో కలిసి పనిచేయడం, మంత్రిగా తనకు సహకరించడం తదితర మరుపులేని ఘట్టలు ఎన్నో ఉన్నాయని, రాష్ర్టంలో కాంగ్రెస్‌ పార్టీని, రాష్ర్టాని అభివృద్ధి వైపు నడిపిన గొప్ప మహోన్నతవ్యక్తి వై.ఎస్‌.ఆర్‌ కొనియాడారు.  ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు జనంలో ఎప్పుడూ పచ్చగానే ఉంటాయని సిఎం అన్నారు. అలాంటి మహానేత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిన్నట్లు మంత్రి గీతారెడ్డి చెప్పారు.  వైఎస్‌ ప్రతమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు రోశయ్య తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఇడుపులపాయలో వైఎస్‌కు కుటుంబ సభ్యుల నివాళి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ప్రథమ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధివద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సతీమణి వైఎస్‌ విజయమ్మ, తనయుడు జగన్‌, కూతురు, కోడలు, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్‌కు నివాళులర్పించారు.
జనసంద్రంగా మారిన ఇడుపుల పాయ
జిల్లాలోని ఇడుపుల పాయ జనసంద్రంగా మారింది. దివంగత సిఎం వైఎస్‌ఆర్‌ ప్రతమ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ ఘాట్‌ను సందర్శించేందుకు ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలి వచ్చారు. జనహృదయ నేతకు జనం నివాళులర్పించారు. అపరభగీరథుని ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని వేడుకున్నారు. దాదాపు లక్ష మంది వరకు వైఎస్‌ అబిమానులు, కార్యకర్తలు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాటన్‌ను సందర్శించినట్లు సమాచారం.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రథమ వర్థంతి గురువారం జరగనుంది. 2009 సెప్టెంబర్‌ రెండున హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ఆర్‌ దుర్మరణం చెందారు. ఆయన ప్రథమవర్థంతి సందర్భంగా నేడు కడప జిల్లా ఇడుపులపాయలో నివాళులర్పించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, కేంద్ర మంత్రులు హాజరవుతున్నారు. కేంద్రం తరపున కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీ హాజరై నివాళులర్పిస్తారు. అదేవిధంగా వైఎస్‌ తనయుడు జగన్‌ ప్రత్యేకంగా నివాళులర్పించనున్నారు. సమాచారశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలోనూ ప్రభుత్వం వైఎస్‌కు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంది. పిసిసి ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సాయంత్రం సభను ఏర్పాటు చేశారు. వర్థంతి కార్యక్రమాలు జిల్లాల్లోనూ నిర్వహించాలని డిసిసి, సిసిసి కమిటీలకు ఆదేశాలు జారీ చేసినట్లు పిసిసి నేతలు తెలిపారు. ఇందులో మంత్రులతో పాటు జిల్లా కాంగ్రెస్‌నేతలు పాల్గొంటారని చెప్పారు. ఇదిలావుండగా రాజశేఖరరెడ్డికి ఆయన సతీమణి వైఎస్‌ విజయమ్మ బుధవారమే ఇడుపులపాయలో నివాళులర్పించారు. ఆమె వెంట కుమార్తె షర్మిల, కుటుంబ సభ్యులున్నారు.  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా నేతల్లో కలవరం సృష్టిస్తోంది. ఈ స్మృతి వనాన్ని రాష్ట్రముఖ్యమత్రి కొణిజేటి రోశయ్య గురువారం ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారా లేదా అన్న ప్రశ్న జిల్లా నేతలను వెంటాడుతుంది.  దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ప్రథమ వర్థంతి సందర్భంగా స్మృతివనం ప్రారంభోత్సవం, నంద్యాలలో జరిగే పలు కార్యక్రమాలను కార్యకర్తలను సమీకరించడంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పోటీపడుతున్నారు. ప్రధానంగా శ్రీశైలం ట్రస్టు మాజీ చైర్మన్‌ పెసుల శ్రీనివాస శెట్టి, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డి, నంద్యాల ఎంపి ఎస్‌వి వైరెడ్డి కార్యకర్తలను సమీకరించడంలో తీవ్ర కృషి చేస్తున్నారు. నాయకుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఒకరినొకరు దెబ్బతీసేందుకు వ్యూహాలు కూడా రూపొందిస్తున్నారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్న మీమాంస కూడా నెలకొంది. ఇదిఇలా ఉండగా, ఒకవేళ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరైతే ఈ కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అన్న సందిగ్దంలో నేతలు ఉండటం మరో విశేషం. కడప పార్లమెంట్‌ సభ్యుడు, వైఎస్‌ తనయుడు వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమానికి హాజరుకావడంలేదు. ఇడుపులపాయలో జరిగే కార్యక్రమంలో పాల్గొని అనంతరం తిరుపతికి వెళ్లనుండటంతో కర్నూలు జిల్లాలో జరిగే కార్యక్రమానికి ఆయన దూరమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్‌ వర్గం ఎటువెళ్లాలనే సందిగ్దంలో పడింది.
కాగా, డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గత ఏడాది సెప్టెంబర్‌ 2వ తేదీ కర్నూలు జిల్లా, ఆత్మకూరు మండలంలోని నల్లకాలువ గ్రామ సమీపంలో వెలుగోడు రిజర్వాయర్‌ ఫారెస్ట్‌ కింద ఉన్న పావురాళ్లగుట్టపై జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలోదుర్మణం చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రజా నాయకుని స్మృతి చిహ్నంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనం ప్రాజెక్టును నెలకొల్పేందుకు వెలుగోడు రిజర్వు ఫారెస్ట్‌లోని ఆత్మకూరు వన్యప్రాణి సంరక్షణ విభాగం పరిధిలోని 1412.14 హెక్టార్లు(1300 ఎకరాలు) ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాజెక్టు కోసం పంపిన 1300 లక్షల రూపాయల ఆర్థిక ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని మూడేళ్ళలో పూర్తి చేయాలన లక్ష్యంగా నిర్ణయించారు. వైఎస్‌ఆర్‌ స్మృతివనం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా స్మృతి వనం పక్కనే సేకరించిన మరో 22.20 ఎకరాల ప్రైవేట్‌ భూమిని ప్రస్తుతం స్మారక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నారు. ప్రభుత్వం సేకరించిన 22.20 ఎకరాల భూమిలో ప్రస్తుతం ప్రధానంగా స్మారక నిర్మాణం, ఆ నిర్మాణం చుట్టూ ఉద్యానవనం, పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అభయారణ్యంలో ప్రభుత్వం కేటాయించిన 3500 ఎకరాల భూమిలో నెమరళ్ళు, అడవికోళ్ళ పునరుత్పత్తి, కేంద్రం, లేళ్ళు, దుప్పీల వంటి జంతువుల పునరుత్పత్తి కేంద్రం, ప్రకృతి వీక్షణ కేంద్రం, జీవ వైవిద్య ఉధ్యాన వనం, ఆత్మకూరు నుండి ప్రాజెక్టు వరకు రోడ్డు పొడవునా చెట్లు నాటటం వంటి పనులు చేపట్టనున్నారు.
ఈ స్మృతి వనానికి సంబంధించిన కట్టడాలు, ల్యాండ్‌ స్కేప్‌ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించేందుకు ముంబయికి చెందిన కిశోర్‌ డి ప్రధాన్‌ సంస్థను ఎన్నుకున్నారు. ప్రాజెక్టు బిడ్స్‌ నిర్వహణ బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన హిట్‌వెల్‌ సంస్థకు అప్పగించారు. సివిల్‌ వర్క్స్‌కు సంబంధించిన పనులను థర్డు పార్టీ క్వాల్టీ కంట్రోల్‌ను హైదరాబాద్‌లోని జెఎన్‌టియు కాలేజీఆఫ్‌ ఇంజనీరింగ్‌ నిర్వహిస్తుంది. ఇకపోతే ల్యాండ్‌ స్కేప్‌ అభివృద్ది పనుల నాణ్యతను హైదరాబాద్‌కు చెందిన అగ్రిహార్టికల్చర్‌ సోసైటీ సంస్థ పర్యవేక్షిస్తుంది. స్మారక నిర్మాణంలో భాగంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహాయంతో 20 అడుగుల ఎత్తుగల డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. స్మృతి వనానికి సంబంధించి ప్రస్తుతం రూ 43.94 లక్షలతో ఉద్యాన వనం అభివృద్ది, నిర్వహణ, రూ 15.27 లక్షలతో ప్రహరిగోడ నిర్మాణం, రూ 74.39 లక్షలతో స్మారక నిర్మాణం, పౌంటెన్‌ వంటి నిర్మాణం పనులు, రూ 19.86 లక్షలతో చైర్‌లింక్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు, రూ 31.83 లక్షలతో పేవర్‌ బ్లాక్‌ల ఏర్పాటు, రూ 7.79 లక్షలతో ప్రహరిగోడకు ఎంఎస్‌ గ్రిల్‌ ఏర్పాటు వంటి పనులు పూర్తి చేశారు. స్మృతి వనం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ రాం శంకర్‌ నాయక్‌, జిల్లా ఎస్‌పి సిహెచ్‌ శ్రీకాంత్‌ తదితర అధికారులు పరిశీలిస్తూ అందంగా దీర్చిదిద్దడంలో సఫలమయ్యారు. సుమారు వారం రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నప్పటికి ఈ కార్యక్రమానికి ఆటంకం కలుగకుండా అధికారులు పనులు పూర్తి చేయించడం విశేషం. అలాగే ముఖ్యమంత్రి ఈ స్మృతివనాన్ని ప్రారంభించేందుకు రానుండటంతో పోలీస్‌ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.

Leave a Reply

free website analytics