నేడు, రేపు జిల్లాలో మంత్రులు పర్యటన

రాష్ర్ట మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్. రఘవీరారెడ్డి, డా.జె.గీతారెడ్డి, ప్రభుత్వ విఫ్ డాక్టర్ సాకే శైలజానాథ్, శాసనమండలి విఫ్ వై. శివరామిరెడ్డి, జిల్లాలో పర్యటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జనార్థన్‌రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ర్ట మున్సిపాల్ శాఖ మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఆదివారం ఉదయం 7.45 గంటలకు బెంగళూరు నుంచి పెనుకొండకు రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 9.30 గంటలకు శ్రీకృష్ణదేవరాయల విగ్రహా విష్కరణకు హాజరవుతున్నట్లు తెలిపారు. అనంతరం 10.30 పెనుకొండ నుంచి రోడ్డు మార్గాన హిందూపురం చేరుకొని ఉదయం 11 గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, తదనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మున్సిపల్ శాఖ అధికారులతో ప్రాంతీయ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి బెంగళూరు వెళ్లనున్నట్లు తెలిపారు.రాష్ర్ట సమాచార మరియు పర్యటక శాఖ మంత్రలు డాక్టర్ జె. గీతారెడ్డి ఈ నెల 6 సోమవారం ఉదయం 6.15 నిమిషాలకు పుట్టపర్తి చేరుకోని సల్ప విశ్రాంతి అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరవుతారు. అనంతరం రాత్రి 8.30 నిమిషాలకు పుట్టపర్తి నుంచి ధర్మవరం రైల్వే స్టేషన్‌కు చేరుకొని కాచిగూడ ఎక్స్‌ప్రెస్ గుండా హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు.
ప్రభుత్వ విఫ్ సాకే శైలజానాథ్ శనివారం అనంతపురం చేరుకొని ఆదివారం,సోమవారం, మంగళవారం, బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యాక్రమాలకు హాజరై బుధవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. శాసనమండలి విఫ్ వై. శివరామిరెడ్డి ఆదివారం ఉదయం 5.30 గంటలకు అనంతపురం చేరుకొని స్థానిక రోడ్లు భవనాల అథిది గృహాంలో సల్ప విశ్రాంతి అనంతరం 8 గంటలకు పెనుగొండ చేరుకొని శ్రీకృష్ణదేవరాయ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం హిందూపురం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ విగ్రహావిష్కరణ కార్యాక్రమంలో పాల్గొని 4.30 నిమిషాలకు వజ్రకరూరు మండలంలో కొనకొండ్ల గ్రామంలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరవుతారు.




