నేను సైతం – గుండు గీయించుకున్న కన్నడ మంత్రి

28.07 12
నల్లటి దుస్తులు, నున్నగా గుండుతో ఉన్న ఈ వ్యక్తిని గుర్తు పట్టారా? కర్ణాటక ఆరోగ్య మంత్రి బి. శ్రీరాములు! కాంగ్రెస్ నేతలు బళ్లారి సంస్కృతిని అవమానపరిచినందుకు నిరసనగా శిరోముండనం చేయించుకుని, నల్లటి దుస్తులు ధరిస్తున్నానని ప్రకటించారు.  బళ్లారి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులను విలన్లుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ నేతలు పన్నుతున్న వ్యూహం ఫలించదని రక్తంతో రాయిస్తానన్నారు. బుధవారం బళ్లారిలో తన ఇంట్లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతల దిష్టి బళ్లారికి తగలకుండా ఓ దిష్టిబొమ్మ కూడా కడతానన్నారు.
వరలక్ష్మీ వ్రతం వచ్చే (ఆగస్టు 20) వరకు వైరాగ్యజీవనం గడుపుతూ కటికనేలపై పడుకుని ఉపవాసం ఉంటూ ధాన్యపు గింజలతో కడుపు నింపుకొంటానన్నారు. బుధవారం నల్లదుస్తులు ధరించి దుర్గమ్మ దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్ చేపట్టిన బళ్లారి పాదయాత్రకు పోటీగా చలో మైసూరు పాదయాత్ర చేస్తామని శ్రీరాములు ప్రకటించగా, సీఎం ససేమిరా అనడంతో అలకబూని రాజీనామా అస్త్రన్ని ప్రయోగించారు. గాలి జనార్దనరెడ్డి వెంటనే హెలికాప్టర్‌లో బళ్లారి వెళ్లి, శ్రీరాములును బుజ్జగించారు. రాష్ట్రంలో ముడి ఖనిజం ఎగుమతులపై నిషేధం విధిస్తూ గురువారంలోగా ఆదేశాలు జారీ చేయనున్నట్లు సీఎం యడ్యూరప్ప ప్రకటించారు.

Leave a Reply

free website analytics