పంట రుణాలను వెంటనే పూర్తిచేయాలి కలెక్టర్‌ ఆదేశాలు

ఖరీష్‌ పంటరుణాల మంజూరు ప్రక్రియ సమయాన్ని సెప్టెంబర్‌ 20 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అందుకు అనుగుణంగా పంటరుణాల లక్ష్యసాదనను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి బ్యాంకు అదికారులకు సూచించారు.సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో పంటరుణాల మంజూరుపై బ్యాంకు అదికారులతో సమీక్షనిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటివరకూ రూ.1567 కోట్ల పంటరుణాలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.సెప్టెంబర్‌ 20నాటికి మిగిలిన రూ.33 కోట్ల పంటరుణాలను రైతులకు అందించడానికి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.దీంతోపాటు ప్రభుత్వ సంక్షేమహాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా వారికి వాటర్‌ ఫ్యూరిఫైయర్లను అందచేయాల్సిందిగా బ్యాంకు అదికారులను కోరారు.ఈ సమావేశంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రాఘవేంద్ర,సిండికేట్‌ జిఎమ్‌ రవిశంకర్‌,కెనరా బ్యాంకు అదికారి కులకర్ణి,డిసిసి బ్యాంకు అదికారి నరసింహారెడ్డి,అనంతగ్రామీణబ్యాంకు అదికారి శ్రీదేవి తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

free website analytics