పది మంది ఎమ్మెల్యేలకు అస్వస్థత – చంద్రబాబు సహా పలువు ఎమ్మెల్యేల కంట తడి

రెండు రోజులుగా ఆహారం, నీటి సమస్యలు రావడంతో పది మంది ఎమ్మెల్యేలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. అయినా వారు చంద్రబాబుతో పాటు నిరాహారదీక్ష కొనసాగించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చంద్రబాబు తో సహా పలువురు ఎమ్మెల్యేలు కంట పెట్టారు. వారికి ప్రత్యేక గదులలో చికిత్స చేశారు. సెలైన్‌లు ఎక్కించారు. పల్లె రఘునాథరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, అబ్దుల్ ఘనీ, వేణుగోపాలాచారి, అశోక్‌గజపతిరాజు, లింగారెడ్డి, సత్యవతి రాథోడ్, గుండు సుధారాణి, మీనాక్షినాయుడు నీరసంతో పడిపోయారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పంపిన 20 మంది వైద్యుల ప్రత్యేక బృందం సోమవారం సాయంత్రం ధర్మాబాద్ చేరుకుని అస్వస్థతకు గురైన వారికి వైద్య పరీక్షలు జరిపింది. వీరిలో అశోక్‌గజపతిరాజు, మండవ, అబ్దుల్ ఘనీలకు డయేరియాగా గుర్తించారు. వారికి సెలైన్లు ఎక్కించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడిన డాక్టర్ సంతోష్ ఎమ్మెల్యేల ఆరోగ్యస్థితిని వెల్లడించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు అనారోగ్యం పాలయ్యారని, మరో ఐదుగురు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని చెప్పారు.




