పరీక్ష నిర్వహిస్తే ప్రళయం సృష్టిస్తామన్న కేసీఆర్ ఎక్కడ ?

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలో తె లంగాణ వాటా తేల్చకుండా పరీక్ష నిర్వహిస్తే ప్రళయం సృష్టిస్తామని, ఎవరూ ఆపలేరని గర్జించిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నాడు పరీక్ష జరుగుతున్నప్పుడు మాత్రం పార్టీ కార్యాలయానికే పరిమితమయ్యారు. వందలాది మంది విద్యార్థులు, కాంగ్రెస్ ఎంపీలు ఉస్మానియాలో పరీక్ష జరుగుతున్న బీఎడ్ కాలేజీ వద్దకు వచ్చేందుకు శతవిధాల ప్రయత్నించి అరెంస్టు కాగా కేసీఆర్ మాత్రం తెలంగాణ భవన్‌లో సాయం త్రం మీడియా సమావేశానికే పరిమితమయ్యారన్న విమర్శలు విద్యార్థుల నుంచి వస్తున్నాయి. టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ మాత్రం క్యాంపస్ దాకా వచ్చి మిగిలిన నేతలతో పాటు అరె స్టు అయ్యారు.
కేసీఆర్ మౌఖికంగా సంఘీభావం ప్రకటించటంతో పాటు కొద్ది సేపైనా క్యాంపస్‌వైపు వచ్చి ఉంటే విద్యార్థులకు మరింత ధైర్యంగా ఉండే దన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి చెందిన ఇతర నేతలు తన్నీరు హరీశ్‌రావు, డి.విన యభాస్కర్, నారదాసు లక్ష్మణరావు లాంటి వారు ఇతర జిల్లాల్లో విద్యార్థులకు నా యకత్వం వహించి అరెస్టు అయి నప్పుడు జంటనగరాల్లో ఉన్న నేతలు ఎక్కువగా క్యాంపస్‌కు కానీ, ఇతర ప్రాంతాలలో కానీ కనిపించకపోవటం సబబుగా లేదన్న అభిప్రాయాలు విద్యార్థి వర్గాల నుంచి వస్తున్నాయి.
సైకిల్‌ను ఎలా విమర్శిస్తాం?
పరీక్ష వాయిదా వేయాలన్న డిమాండ్‌ను అనేక రోజుల నుంచి చేస్తూ, పార్టీ శ్రేణులను సమన్వయ పరచిన కేసీఅర్, చివరి నిముషంలో కార్యక్షేత్రంలో కనిపించకుండా తెలుగుదేశం పార్టీ నేతలను ఎలా విమర్శించగలమన్న ప్రశ్న టీఆర్‌ఎస్ వర్గాల నుంచి వస్తున్నది. సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డిని గృహ నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత మిగిలిన నేతలెవరూ పరీక్షా కేంద్రాలకు రాకపోవటం వ్యూ హాత్మకంగా కొంత పొరపాటేనని కొందరు నేతలు తెలిపారు. కేసీఆర్ కొద్దినిముషాల పాటైనా క్యాంపస్ ప్రధాన ద్వారం దాకా వచ్చి వెళ్ళి ఉంటే టీడీపీ నాయ కత్వాన్ని మరింత ఇరకాటంలో పడవేసే వీలుండేదన్న అభిప్రాయాన్ని ఆ నాయకులు వ్యక్తం చేశారు.




