పశ్చిమ గోదావరి జిల్లాలో నక్సల్స్‌ డంప్‌ స్వాధీనం

dump copy
పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నక్సల్స్‌ డంప్‌ను వరంగల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తణుకు మండలం పైడిపర్రిలో నక్సల్స్‌ కార్యకలాపాలు చేస్తున్న ఇంట్లో పోలీసులు సోధాలు చేశారు. వరంగల్‌ జిల్లా ఎన్‌కౌంటర్‌లో మరణించిన టెక్‌ రమణ అలియాస్‌ కొండల్‌ రెడ్డి నుంచి లభించిన సమాచారం ఆధారంగానే పోలీసులు ఈ సోదాలు చేసినట్లు సమాచారం. నట్లు బోల్టుల వ్యాపారం పేరుతో పైడిపర్రిలో గత నాలుగు సంవత్సరాలుగా నక్సల్స్‌ కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసు తనిఖీల్లో తేలింది.

Leave a Reply