పీసిసి అధ్యక్షపదవికి డీఎస్‌ రాజీనామా – జేఎసీ

27pan1c
పీసీసి అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తక్షణమే తన పదవికి రాజీనామా చేసి తెలంగాణా ఉద్యమంలోకి రావాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణా ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా శ్రీనివాస్, వెంటనే పదవిని వదిలేసి తెలంగాణా రాష్ట్ర సాధనకు తనవంతు కృషి చేయాలన్నారు.  తాము ఇప్పటికే ఎన్నోసార్లు అభ్యర్థించినప్పటికీ శ్రీనివాస్ తన వైఖరి మార్చుకోవడం లేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కొందరు విద్యార్థులు నిజామాబాద్‌లో ప్రగతి నగర్‌లోని ఆయన నివాసాన్ని చుట్టిముట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను అడ్డుకున్నారు.

Leave a Reply