ప్రధానితో ముగిసిన లాలూ, ములాయం, శరత్‌యాదవ్‌ల భేటీ
ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో లాలూప్రసాద్ యాదవ్ (ఆర్‌జేడీ), ములాయం సింగ్ యాదవ్ (ఎస్.పి.), శరద్‌యాదవ్ (జేడీయూ) లతో జరిగిన సమావేశం ముగిసింది. మహిళాబిల్లుపై వారి మద్దతు కోరినట్టు తెలియవచ్చింది. అయితే మహిళా బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరినట్లు సమాచారం. దళిత, మైనార్టీ మహిళలకు కోటా కల్పిస్తూ బిల్లులో సవరణలు చేస్తే బిల్లు ఆమోదానికి సహకరిస్తామని, లేని పక్షంలో బిల్లును ప్రస్తుత రూపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని యాదవ్‌త్రయం పేర్కొన్న విషయం విదితమే.




