ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుల హవా

ప్రపంచ కుబేరుల జాబితాలో వరుసగా రెండవ సంవత్సరం కూడా రిలయన్స్ పరిశ్రమల అధినేత ముఖేశ్ అంబానీకు చోటు దక్కింది. మొత్తం 49మంది భారతీయులకు ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చోటుదక్కగా, మెక్సికోకు చెందిన కార్లోస్ స్లిమ్ హెలూ తొలి స్థానంలో నిలిచారు. బిల్‌గేట్స్ రెండవస్థానంతో సరిపుచ్చుకున్నారు. గత ఏడాది మాదిరిగా ముకేశ్ అంబానీ వరుసగా ఈసారి 29 బిలియన్ డాలర్ల ఆస్తులతో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఆయన ఫోర్బ్స్ జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రపంచ కుబేరుల్లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను పక్కకు నెట్టి 53.5బిలియన్ డాలర్ల ఆస్తులకు అధిపతిగా కార్లోస్ స్లిమ్ హెలూ నిలిచారు. ముఖేష్ తరువాత ఐదవ స్థానాన్ని స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ 28.7బిలియన్ డాలర్ల ఆస్తులకు గాను దక్కిం చుకున్నారు. గత ఏడాది 9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ప్రకటిం చిన మిట్టల్ ఈసారి అంతకు మూడింతల ఆస్తులను ఆర్జిం చారు. ఐటీ దిగ్గజం విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ 17బిలి యన్ డాలర్ల ఆస్తులతో 28వ స్థానంలో నిలిచారు. అంబానీ సోదరుడు అనిల్ అంబానీ ఈ వరుసలో 13.7బిలియన్ డాలర్ల ఆదాయానికి గాను ఈ ఏడాది 36వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఎస్సార్ గ్రూప్ సంస్థలకు చెందిన శశి, రవి రుయా 13బిలియన్ డాలర్ల ఆదాయాలకు ప్రపంచ కుబే రుల జాబితాలో 40వ స్థానాన్ని సంపాదించుకున్నారు. గత ఏడాది జాబితాలో నిలిచిన 24 మంది భారతీయ కుబేరుల సంపద ఈసారి రెండింతలుగా నమోదు కావడం విశేషం. మొత్తం 50 మంది భారతీయులు ఈసారి ప్రపంచ ధనవం తుల జాబితాలో చేరారు. మొదిటి పది స్థానాల్లో నిలిచిన వారిలో ముకేశ్ అంబానీతో పాటు లక్ష్మీ మిట్టల్ ఉన్నారు. టాప్ 100మంది కుబేరుల జాబితాలో 9 స్థానాలను భారతీయులు కైవసం చేసుకున్నారు. ఇందులో ముకేశ్ అంబానీ (4వ స్థానం, 29బిలియన్ డాలర్ల ఆస్తులు), లక్ష్మీ మిట్టల్ (5వ స్థానం, 28.7బిలియన్ డాలర్ల ఆస్తులు), అజీమ్ ప్రేమ్‌జీ (28వ స్థానం, 17బిలియన్ డాలర్ల ఆస్తులు), అనిల్ అంబానీ (36వ స్థానం, 13.7బిలియన్ డాలర్ల ఆస్తులు), శశి, రవి రుజా (40వ స్థానం, 13బిలియన్ డాలర్ల ఆస్తులు), సావిత్రీ జిందాల్ (44వ స్థానం, 12.2బిలియన్ డాలర్ల ఆస్తులు), కేపీ సింగ్ (74వ స్థానం, 9బిలియన్ డాలర్ల ఆస్తులు), కుమార్ బిర్లా (86వ స్థానం, 7.9బిలి యన్ డాలర్ల ఆస్తులు), సునీల్ మిట్టల్ (87వ స్థానం, 7.8బిలియన్ డాలర్ల ఆస్తులు) ఇతర భారతీయ ధనవంతుల జాబితాలో అనిల్ అగర్వాల్ (113వ స్థానం, 6.4బిలియన్ డాలర్ల ఆస్తులు), పాల్లోన్‌జీ మిస్ర్తీ (129వ స్థానం, 5.8బిలియన్ డాలర్ల ఆస్తులు), ఆది గోద్రేజ్ కుటుంబం (148వ స్థానం, 5.2బిలియన్ డాలర్ల ఆస్తులు), గౌతమ్ అదాని (167వ స్థానం, 4.8బిలియన్ డాలర్ల ఆస్తులు). దిలీప్ సింఘ్‌వీ (173వ స్థానం, 4.6బిలియన్ డాలర్ల ఆస్తులు), శివ్ నాడార్ (201వ స్థానం, బిలియన్ డాలర్ల ఆస్తులు), జీఎం రావు (297వ స్థానం, 3.2బిలియన్ డాలర్ల ఆస్తులు), మల్విందర్, శివిందర్ సింగ్ (297వ స్థానం, 3.2బిలియన్ డాలర్ల ఆస్తులు), ఉదయ్ కోటాక్ (316వ స్థానం, 3బిలియన్ డాలర్ల ఆస్తులు), కళానిధి మారన్ (342వ స్థానం, 2.9బిలియన్ డాలర్ల ఆస్తులు), సుభాష్ చంద్ర, మిక్కీ జగిత్యానీ, ఇందు జైన్‌లకు 354వ స్థానం 2.8బిలియన్ డాలర్ల ఆస్తులకు గాను దక్కాయి. ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో అమెరికన్లదే పైచేయి కనిపించగా మొదటి రెండు, మూడవ స్థానాల్ని బిల్ గేట్స్, వారెన్ బఫెట్ దక్కించుకున్నారు.
తెలుగు కుబేరుడు మల్లికార్జునరావే…
రాజాం, మేజర్‌న్యూస్: రాష్ట్రంలో అత్యంత ధనవంతుడిగా రాజాంకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మల్లికార్జునరావు ఈ ఏడాది కూడా తన స్థానాన్ని పదిల పరచుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించిం ది.1985లో వ్యాపార రంగంలో ప్రవేశించిన మల్లికార్జున రావు(మల్లిబాబు) అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందారు. జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలు, రహదారుల నిర్మాణంలో జిఎంఆర్ సంస్థ ముందుకు దూసుకుపోతోంది. పవర్ జనరేషన్, మౌలికవసతుల రంగాల్లోనూ జిఎంఆర్ సంస్థ కీలక భూమిక పోషిస్తోంది.




