ప్రపంచ స్టేట్స్ మెన్’ గా పీఎం
భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు 2010 సంవత్సరానికి “ప్రపంచ స్టేట్స్‌మెన్” అవార్డుతో సన్మానించనున్నట్లు ది అప్పీల్ ఆఫ్ ఫౌండేషన్ సంస్థ శుక్రవారం వాషింగ్ టన్‌లో ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా మాజీ విదేశాంగ శాఖ సహాయ మంత్రి జాన్ నేగ్రోపోంటే తెలిపారు. అమెరికాలోని భారత రాయబారి మీరా శంకర్ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ పురస్కారాన్ని మన్మోహన్‌కు సెప్టెంబరు నెలలో జరిగే ఓ కార్యక్రమంలో అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ స్టేట్స్‌మెన్ అవార్డు పొందేవారిలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌తోపాటు బ్రిటీష్ ప్రధాని గోర్డెన్ బ్రౌన్ (2009), ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ (2008), జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ (2007), బ్రెజిల్ అధ్యక్షుడు లూయీస్ ఇనాషియోలు లాదా సిల్వా (2006)లున్నారు. ప్రపంచవ్యాప్తంగానున్న ధార్మిక స్వతంత్రత, మానవాధికారాలపై ఈ సంస్థ పనిచేస్తుంటుంది.




