ఫలితమివ్వని గెలుపు
నెదర్లాండ్స్‌తో జరిగిన పూల్-ఎ రెండో మ్యా చ్‌లో దక్షిణ కొరియా 2-1 తేడాతో విజయం సాధించి నా సెమీస్ బెర్త్‌ను దక్కించుకోలేక పోయింది. ఈ మ్యాచ్‌లో ఓడినా గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ సెమీస్‌కు చేరుకొంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కొరియా చిరస్మరణీయ విజయాన్ని అందుకొంది. అద్భుత ఆటతో పటిష్టమైన హాలండ్‌ను ఓడించింది. ప్రారంభం నుంచే రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. ఆట మొదటి నిమిషంలోనే రొనాల్డ్ బ్రొవర్ నెదర్లాండ్స్‌కు తొలి గోల్ అందించాడు. ప్రారంభంలో కాస్తా వెనుకబడ్డ కొరియా తర్వాత తేరుకొంది. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌వైపు పదేపదే దాడులు చేసి ఉక్కిరిబిక్కిరి చేసింది. మరో నాలుగు నిమిషాల్లో తొలి అర్ధభాగం ముగుస్తుందనగా కొరియాకు మొదటి గోల్ లభిం చింది. స్టార్ ఆటగాడు వూ నామ్ హ్యూన్ ఈ గోల్ సాధిం చాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. ద్వితీయార్ధంలో రెండు జట్లు విజృంభించి ఆడాయి. అయితే గోల్స్ చేయడంలో మాత్రం విఫలమయ్యాయి. 45వ నిమిషంలో జాంగ్ హోసి కొరియాకు రెండో గోల్ అందించాడు. దీన్ని చివరివరకు కాపాడుకున్న కొరియా 2-1 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. గోల్స్‌లో పైచేయి సాధించిన నెదర్లాండ్స్ సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. మరో సెమీస్‌లో జర్మనీ-ఇంగ్లాండ్‌తో ఢీకొంటుంది.




