బాబును విమర్శించే స్థాయి శివరామిరెడ్డికి లే దు – ఎమ్మెల్యే కేశవ్
తెలుగుదేశం పార్టీ అ ధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును విమర్శించే స్థాయి ఎమ్మెల్సీ శివరామిరెడ్డికి లేదని ఉరవకొండ ఎ మ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నా రు. మండలంలోని మోపిడి గ్రా మంలో శుక్రవారం ఏర్పాటు చే సిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అ ధినేత చంద్రబాబు నేడు పదవీకాంక్షతోనే రైతు పోరుబాటను చేపట్టారని ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఏడేళ్లుగా మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తన ఉనికి కోసం కేంద్ర మంత్రి ప్రకటన తో కరువు బృందం పర్యటన అధ్యయనం చేస్తోందని చెబుతూ రైతులను మబ్యపెట్టేందుకు ఉపక్రమించిందన్నారు. జిల్లా రైతులు ఏడేళ్లుగా తీవ్ర కరువుతో సతమతమవుతున్నా ప్రభుత్వం కబోదిలా ఉందన్నా రు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం దద్దమ్మ పాలన సాగిస్తోందన్నారు. కరువుతో రె ౖతులు అల్లాడిపోతుంటే డిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి పర్యటించిందన్నారు. ముఖ్యమంత్రి కేంద్రానికి పంపిన కరువు నివేదికను ఆమోదించకుండా కేంద్ర బృందాన్ని పంపడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోవిందు, తెలుగుదేశం పార్టీ నాయకులు రాంబాబు, రాజగోపాల్, వన్నూరుస్వామి, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.




