బ్రహ్మణిపై బాబుది రాజకీయం – శైలజానాథ్

SAILuబ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని బుధవారం కాంగ్రెస్ విప్ శైలజానాథ్ ఆరోపించారు. బ్రహ్మణి విషయంలో ఇదివరకే ప్రభుత్వం వివరణ ఇచ్చినా చంద్రబాబు పదేపదే అదే పట్టుకు వేలాడడం సరికాదని ఆయన అన్నారు. చంద్రబాబు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని, తన స్వార్థ రాజకీయాలకు అసెంబ్లీని వేదికగా మార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న ఎన్నో ప్రజా సమస్యలను వదిలేసి, రాయలసీమలో పదివేల మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టును అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నించడాన్ని శైలజానాథ్ తప్పుబట్టారు.

Leave a Reply

free website analytics