భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి – స్పీకర్

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో పురోగమించి ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని శనివారం స్పీకర్ కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. నాగార్జున వర్సిటీలో ఏపి ఎకనమిక్ అసోసియేషన్ 28వ వార్షిక సదస్సులో కిరణ్‌కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నదని అన్నారు. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కూడా మంచి వృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నదంటూ కొన్ని ఉదాహరణలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్థిక నిపుణులు, ఆచార్యులతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.సి.రెడ్డి ఎకనమిక్ అసోసియేషన్ చైర్మన్ హోదాలో పాల్గొన్నారు.




