మణిపూర్‌లో నేడు పోలింగ్

తీవ్రవాదుల బాంబు పేలుళ్ళ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ ఎన్నికలను సజావుగా జర గనివ్వకూడదన్న హెచ్చరికలతో తీవ్రవాదులు బాంబు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యం మణిపూర్‌లో నేడు పోలింగ్ జరు గుతున్నది. దీనితో ఐదు రాష్ట్రాల ఎన్నికల క్రతువుకు శ్రీకారం చుట్టినట్లవుతుంది. కాగా, 60 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న ఈశాన్య భారత రాష్టమ్రైన మణిపూర్‌లో పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అరాచక శక్తులు అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని నిఘా విభాగం హెచ్చరించింది. దీనితో అవాంఛనీయ సంఘ టనలకు ఆస్కారం ఇవ్వరాదన్న లక్ష్యంతో అధికారులు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.
మణిపూర్ పదవ అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు మొత్తం 279 మంది అభ్య ర్థులు బరిలో నిలిచారు. భద్రత విష యంలో రాజీలేకుండా పోలింగ్ బూత్ ల వద్ద కేంద్ర పారా మిలిటరీ దళాలతో ట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన ట్లు, రాష్ట్రానికి చెందిన భద్రతా దళ సభ్యులెవ్వరినీ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం నియమించలేదని అధి కారిక వర్గాలు స్పష్టం చేశా యి. అయితే, అవసరమైతే మాత్రం రాష్ట్ర భద్రతా సిబ్బందిని కేంద్ర దళాలకు తోడుగా పంపించనున్నట్లు ఆ వర్గాలు తెలి పాయి. కాగా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల శాసనసభలకు ఈ నెల 30న, గోవాలో మార్చి 3న ఎన్నికల పోలింగ్ జరుగు తుంది. ఏడు విడతలుగా జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ కూడా అదే రోజున పూర్తవుతుంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 6వ తేదీన జరుగు తుంది.
పోలింగ్ నిర్వహణ కోసం శుక్రవారం సాయంత్రానికే మణ ిపూర్‌లో అత్యధిక సంఖ్యలో పోలింగ్, భద్రతా సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారని ఎన్నికల సంఘం కార్యా లయం తెలిపింది.
మొత్తం 2,357 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిం చేందుకు గాను 12,967 మంది అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. మణిపూర్‌లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని ఎన్నిక సంఘం కార్యాలయం వెల్లడించింది. మణిపూర్‌లో 8,82,236 మంది మహిళలు సహా మొత్తం 17,40,576 మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు.గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న బాంబు పేలుళ్ళ నేపథ్యంలో కొందరు అభ్యర్థులను కూడా తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకొన్నట్లు రాష్ట్ర రాజధానికి అందుతున్న సమాచారం సూచిస్తోంది.
పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని థంగ్‌మీబాంద్‌లోని ఓ మాజీ ప్రభుత్వ అధికారి బిలాసినీదేవి ఇంటి సమీపంలో శుక్రవారం ఉదయం తీవ్రవాదుల బాంబు పేలుడులో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ప్రభుత్వ వైద్యురాలైన బిలాసినీదేవి భర్త గత ఎన్నికల్లో పోటీ చేశారు. మరో పక్కన ఇంఫాల్‌లోని కేపిటల్ కాంప్లెక్స్‌లో గణతంత్ర దినోత్సవం రోజున కూడా తీవ్రవాదులు అత్యంత శక్తివంతమైన బాంబును పేల్చారు. అయితే, ఈ సంఘ టనలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. ఈ నెల 25 రాత్రి పశ్చి మ ఇంఫాల్ జిల్లాలోని కాక్వాలో రెండు శక్తివంతమైన బాంబు లను పేల్చారు.




