మహిళా క్రికెట్‌కు జీవం పోసిన మంత్రి గీతా రెడ్డి

  • విజేతగా తిరిగి రండి – రాష్ర్ట సీనియర్‌ జట్టుకు కిట్లు పంపిణి

DEV_0074
జాతీయ స్థాయి మహిళా క్రికెట్‌ పోటీల్లో పాల్గోనే 20-20 రాష్ర్ట సీనియర్‌ జట్టుకు మంత్రి గీతా రెడ్డి కిట్‌లను పంపిణీ చేశారు.  లుథియానాలో జరిగే జాతీయ స్థాయి మహిళా క్రికెట్‌ పోటీల్లో పాల్గోనే 20-20 రాష్ర్ట సీనియర్‌ జట్టు టోర్నీలో విజేతగా గెలవాలని క్రీడాస్ఫూర్తితో రాణించి రాష్ర్టానికి కీర్తి ప్రతిష్టలు తీసుకు రావాలని రాష్ర్ట మహిళా క్రికెట్‌ సంఘం అధ్యక్షురాలు, సమాచార టూరిజం శాఖ మంత్రి జె. గీతారెడ్డి ఈ రోజు ఉదయం మహిళా క్రికెటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు.  ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ మహిళా క్రికెట్‌ జట్టు జాతీయ స్థాయి మహిళా క్రికెట్‌ టోర్నీ జట్టు  అధ్యక్షురాలు గీతా రెడ్డిని కలిసారు. రాష్ర్ట జట్టుకు ఎంపికైన వారి వివరాలను మంత్రి ప్రకటించి అభినందించారు.

10
రాష్ర్టంలో మహిళా క్రీడల ప్రోత్సాహం లేదన్నది కాదనలేని సత్యం.  మహిళా క్రీడలంటే అందరికి చిన్న చూపే, రాష్ర్టంలో మహిళా క్రీడలను ప్రోత్సహించే నాయకుడు, సేవకులు ఎవరయినా ఉన్నారంటే అందులో ప్రథమ స్థానం మంత్రి గీతారెడ్డిదే అని చెప్పక తప్పదు.  రాష్ర్టంలో మహిళా క్రికెట్‌ను గత 30 సంవత్సరాలుగా అంచెలంచెలుగా అభివృద్ధి చేసిన ఘనత, క్రీడకు జీవం పోసిందని మహిళా క్రికెటర్లలో గీతారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది.  దేశంలోనే రాష్ర్ట మహిళా క్రికెట్‌ సంఘానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.  ఆంధ్రప్రదేశ్‌ మహిళా క్రికెట్‌ అసోసియేషన్‌కు గత 20 సంవత్సరాలుగా అధ్యక్షురాలుగా ఉంటూ రాష్ర్టం నుండి ఎందరో అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేసిన ఘనత ఎ.పి. మహిళా క్రికెట్‌ సంఘానిది.  లక్ష్మీ, మిథాలి రాజ్‌, పూర్ణిమా రావు, రజని వేణుగోపాల్‌ లాంటి క్రీడాకారిణులను దేశానికి ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్లను తయారు చేసిన ఘతన మహిళా క్రికెట్‌ సంఘానిది.  గీతారెడ్డి సూచనలతో రాష్ర్టంలో మచ్చా రామలింగా రెడ్డి అంచెలంచెలుగా మహిళా క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్ళారు.  రాష్ర్టంలో ప్రస్తుతం అన్ని జిల్లాల్లో సంఘాలు ఉన్న ఏకైక క్రీడా సంఘం మహిళా క్రికెట్‌ అసోసియేషన్‌.  రాష్ర్టంలో వెయి మంది దాకా ప్రస్తుతం మహిళలు క్రికెట్‌ ఆడుతున్నారంటే దానికి గీతారెడ్డి కృషే కారణమని క్రికెట్‌ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇవాల మహిళలు క్రికెట్‌ ఆడటానికి ముందుకు వస్తున్నారంటే అది ఆమె చోరవే.. సొంత డబ్బులతో మహిళా క్రికెట్‌ను రాష్ర్టంలో ముందుకు తీసుకెళ్ళిన నాయకురాలు ఆమె.  అందరు పదవులకోసం పనిచేస్తున్న క్రీడా వ్యవస్థలో క్రీడ కోసం పనిచేసిన ఏకైక నాయకురాలు గీతా రెడ్డే, శ్రీమతి గీతా రెడ్డి గారు మహిళా క్రికెట్‌కు జీవం పోశారు.  ఇవాళ రాష్ర్టంలో మహిళా క్రికెట్‌ ఒకటి ఉందంటే అందుకు ప్రధాన కారకురాలు, ప్రేరకురాలు, ప్రోత్సాహకురాలు శ్రీమతి గీతా రెడ్డి గారు, రాష్ర్టంలో పలు జిల్లాలో మహిళా క్రికెట్ టోర్నమెంట్లు జరగడం వెనుకాల గీతా రెడ్డి గారి ప్రోత్సహం, ప్రోద్భలం ఎంతో ఉంది.  గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతులు క్రీడల్లో రాణించడానికి, ప్రభుత్వం తరుపున ఎలాంటి ప్రోత్సాహకాలు అందాలో మంత్రిగా ఉన్న గీతా రెడ్డి గారు వాటిని అందించారు.  ఆమె చలువతో ప్రోత్సాహంతో మన రాష్ర్టం నుండి ఎంతో మంది యువతులు జాతీయ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్లలో పాల్గొంటూ రాష్ర్ట కీర్తి ప్రతిష్టల్ని జాతీయ స్థాయిలో వెలిగించారు.  ఒక మాటలో చెప్పాలంటే రాష్ర్ట మహిళా క్రికెట్‌కు జీవం పోసిన స్ఫూర్తి ప్రదాత శ్రీమతి గీతా రెడ్డిగారు. క్రీడారంగానికి ఆమె చేసిన సేవలు అనితర సాధ్యం.

  • రాష్ర్ట జట్టు విజేతగా తిరిగి రావాలి

05
రాష్ర్ట సీనియర్‌ మహిళా క్రికెట్‌ జట్టు నేషనల్‌ టోర్నీలో విజేతగా గెలవాలని క్రీడాస్ఫూర్తితో రాణించి రాష్ర్టానికి కీర్తి ప్రతిష్టలు తీసుకు రావాలని రాష్ర్ట మహిళా క్రికెట్‌ సంఘం అధ్యక్షురాలు, సమాచార టూరిజం శాఖ మంత్రి జె. గీతారెడ్డి ఈ రోజు ఉదయం మహిళా క్రికెటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు.  లుథియానాలో జరిగే జాతీయ స్థాయి మహిళా క్రికెట్‌ పోటీల్లో పాల్గోనే 20-20 రాష్ర్ట సీనియర్‌ జట్టుకు మంత్రి కిట్‌ను పంపిణీ చేసి టోర్నీకి పంపించారు.  ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ మహిళా క్రికెట్‌ జట్టు జాతీయ స్థాయి మహిళా క్రికెట్‌ టోర్నీ జట్టు  అధ్యక్షురాలు గీతా రెడ్డిని కలిసారు. రాష్ర్ట జట్టుకు ఎంపికైన వారి వివరాలను మంత్రి ప్రకటించి అభినందించారు.  రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మచ్చా రామలింగా రెడ్డి మంత్రి గీతా రెడ్డికి రాష్ర్ట జట్టు క్రీడా కారిణిలను పరిచయం చేశారు.  ఈ కార్యక్రమంలో ఖమ్మం సెక్రటరి మతిన్‌, చిత్తూరు సక్రటరి కిరణ్‌, కర్నూలు సెక్రటరి మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంతి రాష్ర్ట క్రికెటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా క్రికెట్‌ అభివృద్ధికి ఎంతో కృషి చేసిందనఇ గుర్తు చేశారు.  రాష్ర్టంలో మహిళా క్రికెట్‌ అభివృద్ధికి గత 35 ఏళ్ళుగా మహిళా క్రికెట్‌ అసోసియేషన్‌ పనిచేసిందని, నేను అటువంటి ఉన్నత సంఘానికి అధ్యక్షురాలుగా 20 సంవత్సరాలుగా ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు.  రాష్ర్టంలో ఎందరో జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేసిన ఘనత ఎ.పి. మహిళా క్రికెట్‌ అసోసియేషన్‌కు ఉందన్నారు.  క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకుని క్రికెట్‌లో రాణించాలని సూచించారు.  భారత మహిళా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆదేశాల మేరకు పంజాబ్‌ రాష్ర్ట మహిళా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో లుథియానా నగరంలో సెప్టెంబర్‌ నెల -4 నుంచి 7 దాకా జాతీయ స్థాయి సీనియర్స్‌ 20-20 చిమన్‌ బాయ్‌ పటేల్‌ (మాజీ ముఖ్యమంత్రి) గుజరాత్‌ పేరు మీద మహిళా క్రికెట్‌ టోర్నీ నిర్వహించాలనఇ నిర్ణయించినట్లు భారత మహిళా క్రికెట్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరి, ఎ.పి. ప్రధాన కార్యదర్శి మచ్చా రామలింగా రెడ్డి తెలిపారు.  టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు చత్తీష్‌గడ్‌, బీహార్‌, గుజరాత్‌, యుపి, వెస్ట్‌ బెంగాల్‌, ఢిల్లీ, మహారాష్ర్ట, పంజాబ్‌ తదితర జట్లు పాల్గొంటాయని, టోర్నమెంట్‌ లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  టోర్నమెంట్స్‌లో రాణించిన క్రీడాకారిణులకు భారత జట్టుకు ఎంపిక చేసి ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో శిక్షణా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని మచ్చా రామలింగా రెడ్డి తెలిపారు.

  • కెప్టెన్‌గా ఫెబి మాధురి ఎంపిక

12 copy

లుథియానాలో జరిగే జాతీయ స్థాయి మహిళా క్రికెట్‌ టోర్నీలో జరిగే రాష్ర్ట సీనియర్‌ జట్టుకు చిత్తూరు జిల్లాకు చెందిన ఫెబి మాధురి కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కళ్యాణి వైస్‌ కెప్టెన్‌, రుక్మిణి, సంపూర్ణ, షర్మిలా, వినోద, నాగేంద్రమ్మ, రిచాశర్మ, నూతన్‌, నిషా, శైలజా, భాగ్య, అనుష, క్రిష్ణ శ్వేతా, క్రిష్ణ ప్రజ్ఞలు జట్టు సభ్యులుగా ఎంపిక చేయగా,  జట్టు మేనేజర్‌గా ప్రియాంకను ఎంపిక చేసినట్లు మచ్చా రామలింగా రెడ్డి తెలిపారు.

Leave a Reply

free website analytics