మహిళా బిల్లుపై లోక్‌సభలో కొనసాగుతున్న నిరసనలు

మహిళా బిల్లుపై లోక్‌సభలో నిరసనలు కొనసాగుతున్నాయి. నిన్న రాజ్యసభలో తమ పార్టీ సభ్యులు లేకుండా బిల్లు ఆమోదించడంపై లోక్‌సభలో ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇందుకు నిరసనగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్‌యాదవ్ పార్లమెంటు వరకూ నడుచుకుంటూ వచ్చారు. అలాగే రాజ్యసభలో బిల్లు ఆమోదంపై చర్చించాలని ఆయా పార్టీల సభ్యులు పట్టుబట్టారు. దీనితో స్పీకర్ మీరాకుమార్ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ప్రశ్నోత్తరాల తర్వాత ఇందుకు అవకాశం కల్పిస్తానని మీరాకుమార్ చెప్పినా సభ్యులు తమ పట్టువీడలేదు. దీనితో మీరాకుమార్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభ వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్ సభ్యులంతా అధినేత్రి సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్‌ల వద్దకు వచ్చి రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినందుకు అభినందనలు తెలియజేశారు.




