మీడియా వక్రీకరించింది – కేసిఆర్

ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద నోటీస్ అందుకున్న తెలంగాణ రాష్టస్రమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్ర శేఖరరావు సోమవారం ఎన్నికల ప్రధాన అధికారికి తన వివరణ పంపారు. గత ఎన్నికల్లో హామీలు మర చిన మంత్రలను తప్పుపట్టినట్లు తెలిపారు. ఇతర పార్టీల వద్ద డబ్బు తీసుకుని తెరాసాకు ఓటేయాలన్న వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించిందని కెసీఆర్ తన వివరణలో పేర్కొన్నారు. హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ ఆదివారం ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.




