మూడో స్థానానికి పడిపోయిన సైనా

03.09.01
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓటమిపాలవడంతో తాజా ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ర్యాంకు రెండో ర్యాంకు నుండి మూడో స్థానానికి పడిపోయింది. గురువారంనాడు ఈ జాబితాను విడుదల చేశారు. ప్రస్తుతం సైనా 64791.2637 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. చైనాకు చెందిన గ్జిన్‌ వాంగ్‌ రెండో స్థానంలో ఉండగా, అదే దేశానికి చెందిన యిహాన్‌ వ్యాంగ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ, సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌తో పాటు, ఇండొనేషియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీల్లో వరుస విజయాలతో సైనా ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణిగా అవతరించి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.

Leave a Reply

free website analytics