మౌలానా హమీదుద్దీన్ మృతి తీరని లోటు – రోశయ్య

_g3_news_me_
దార్లుం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మౌలానా హమీదుద్దీన్ అఖిల్ హుస్సామీ మృతిపై ముఖ్యమంత్రి రోశయ్య విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటని రోశయ్య అన్నారు. పాతబస్తీలోని మౌలానా నివాసానికి వచ్చి ఆయన పార్థివ దేహానికి రోశయ్య నివాళులు అర్పించారు. ఎప్పుడూ పరమత సహనం పాటించే మౌలానా మార్గం అందరికీ అనుసరణీయమని ఆయన అన్నారు. మౌలానా భౌతిక కాయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సందర్శించి నివాళులు అర్పించారు. పేదల బాగు కోసం మౌలానా ఎంతో కృషి చేశారని చంద్రబాబు అంటే, ఆయన లేనిలేటు ఎవరూ తీర్చలేరని అసదుద్దీన్ అన్నారు.

Leave a Reply

free website analytics