యునిస్, యుసుఫ్‌లపై జీవితకాల నిషేధం

Younis Khanపాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ ప్రక్షాళన మొదలైంది. జట్టులోని కీలక ఆటగాళ్ళు యునిస్, యుసుఫ్‌లపై పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) బుధవారం జీవితకాల నిషేధం విధించింది. వీరిపై నిషేధానికి ఆసీస్ టూర్‌లో ఘోర వైఫల్యాన్నే కారణంగా చూపుతున్నప్పటికీ జట్టులో సమిష్ఠితత్వం కొరవడడానికి వీరే కారణమనే ఆరోపణలు రావడం తెలిసిందే. అలాగే రాణా నవీద్, షోయబ్ మాలిక్‌పై ఏడాది కాలం పాటు నిషేధం విధించగా, బాల్ టాంపరింగ్‌కు పాల్పడి పరువు తీసిన ఆఫ్రిది, అక్మల్‌కు జరిమానాతో సరిపెట్టారు.

Leave a Reply