రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 26 మంది మృతి

bus-accident
రాజస్థాన్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది మృతి చెందగా 32 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చించి. సవాయ్‌మాధోపూర్ వద్ద ఓ బస్సు అదుపుతప్పి మోరల్ నదిలోకి దూసుకుపోగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా ఎస్‌టీసీ బీఎడ్ కళాశాల విద్యార్ధులు. వీరంతా హరిద్వార్ విహారయాత్రకు వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply