రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

indianparliamentరాజ్యసభ మంగళవారం ప్రారంభమైన తర్వాత మహిళా బిల్లుపై గందరగోళం చెలరేగడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.  మహిళా బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమంటూ ఆర్‌జేడీ, ఎస్‌పి, బీఎస్‌పీ సభ్యులు సభలో నిరసనలు వినిపించారు.  ప్రశ్నోత్తరాల సమయం కొనసాగిద్దామని, ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని ఛైర్మన్ విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు వినకపోవడంతో.. సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో అన్సారీ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

Leave a Reply

free website analytics