రాయలసీమ ప్రజాప్రతినిధుల సమావేశం
శ్రీకృష్ణ కమిటికి సమర్పించే నివేదికపై చర్చించేందుకు బుధవారం రాయలసీమ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం ఈ సమావేశంలో పాల్గొనలేదు. వారికి ఆహ్వానం పంపినప్పటికీ సమావేశానికి హాజరు కాలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ సమావేశంలో రాయలసీమ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.




