రాష్ట్ర కాంగ్రెస్‌లో నాయకత్వ కొరత లేదు – లగడపాటి

“సీఎం రోశయ్య పాలనను సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆయన ఆంధ్రా మన్మోహన్‌సింగ్” అని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కితాబునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో నాయకత్వ కొరత లేదని స్పష్టంచేశారు. విలేకరులతో సోమవారం మాట్లాడు తూ, జగన్ ఓదార్పుయాత్రతో పార్టీకి సంబంధం లేదన్నారు. జగన్‌ను సీఎం చేయాలన్నది కొందరి వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. మంత్రి బాలినేని వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మంత్రివర్గంలో ఉంటూ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సబబు కాదన్నారు. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవం అని అన్నారని.. అది విలీన దినోత్సవమని తాను సరి చేశానని, ఆలస్యంగా అయినా కేసీఆర్, కోదండరామ్ ఆ విషయాన్ని అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఎవరిపైనా ద్వేషం లేదని, ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ జవాబు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి ఉన్నా.. సీఎం రోశయ్య ఆంధ్రా మన్మోహన్‌లా యువతకు అండగా నిలబడి గ్రూప్-1 పరీక్షలను నిర్వహించడం అభినందనీయమన్నారు.




