రాష్ర్టంలో కుండపోత వర్షాలు

200236712-001
రాష్ట్రంపై ఆవరించిన అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తు న్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని పలు వాగులు వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా నది జల కలతో ఉరకలువేస్తుంది. నాగావళి, వర శధార, తాలిపేరు సైతం సుడులుతిరిగి ప్రవహిస్తుంది. ఇదే ఊపులో మరో 48గంటలు వర్షంకురుస్తే రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజె క్టులు పూర్తిస్థాయిలో నిండిపోతాయన్న ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జూరాల, శ్రీశైలంతో పాటు తుంగభద్ర శ్రీరాం సాగర్‌ తదితర ప్రధాన జలాశయాల నీటి మట్టాలు అంతకంతకు పెరుగుతువస్తున్నాయి. కృష్ణా జిల్లాలో, ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల కృష్ణానదిలోనికి వరద నీరు చేరింది.
వైరా వాగు, మునేరు, బుడమేరుకు ఇన్‌ఫ్లో బాగా పెరిగింది. దాంతో ఆదివారం మధ్యాహ్నం నాటికి ప్రకాశం బ్యారేజి వద్దకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తోదని సమాచారం అందింది. దీంతో అప్ర మత్తమయిన ఇరిగేషన్‌ అధికారులు బ్యారేజి వద్ద 64 గేట్లను ఎత్తి వేశారు. 45 వేల 568క్యూసెక్కుల నీటిని సముద్రంలోనికి వదిలారు. సాయంత్రం నాటికి వరద నీరు రాక తగ్గింది. దాంతో పది గేట్లను మూసి వేశారు. రాత్రి వరకు 54 గేట్ల నుంచి వరద నీటిని సముద్రంలోనికి వదిలారు. సాయంత్రం నాటికి 38 వేల 448 క్యూసెక్కుల నీరు దిగువకు మరలింది. బ్యారేజి నుంచి వున్న మూడు పంట కాల్వలకు ఆదివారం మధ్యాహ్నం నాటికి నీటి విడుదలను నిలిపివేశారు. కాని అప్పటికే జిల్లాలో ని కొన్ని ప్రాంతాల్లో గండ్లు పడ్డట్టు సమాచారం. కాగా వర్షం కారణంగా దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని గోడ కూలింది.
ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఛత్తీస్‌గడ్‌ దండకారణ్యంలో ఐదు రోజులుగా ఎడతె రిపిలేని వర్షాలకు శబరి, తాలిపేరు నదులు పొంగి ప్రవహిస్తుండటంతో ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు రాకపోకలు స్తంభించిపోయాయి. ఛత్తీస్‌గడ్‌కు ఆనుకుని ఉన్న వాజేడు, చింతూరు, చర్ల మండలాల్లో 65 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. తాలిపేరుకు వరద ఉధృతి తీవ్రం కావడంతో పూర్తి స్థాయిలో 23 గేట్లు ఎత్తేసి లక్షా 57వేల 535 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. తాలిపేరుకు వరద ఉధృతి తీవ్రం కావడంతో పూర్తి స్థాయిలో 23 గేట్లు ఎత్తేసి లక్షా 57వేల 535 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో విస్తా రంగా వర్షాలు కురుస్తుండడంతో నాగావళి, వరశధార పరవళ్లు తొక్కుతున్నాయి.దీంతో అధికారులు గేట్లను ఎత్తివే శారు. గొట్టా బ్యారేజీ నీటి మట్టం పెరిగింది.గొట్టాబ్యారేజీలో 22గేట్లు ఎత్తివేశారు. ఆదివారం మధ్యాహ్నానికి వంశధార నీటిమట్టం 53 వేల క్యూసె క్కులకు చేరింది. కొత్తూరు మండలం మాతల వద్ద పెనుగోటిపాడు గ్రామం జలమయమైంది. నాగావళి నదికి గండి పడడంతో ఆమదాలవలస వద్ద నిమ్మతురువాడ గ్రామం ముంపునకు గురైంది. రానున్న 24 గంటల్లో వర్షాలు మరింత విస్తారంగా కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.ముందస్తుచర్యలో భాగం గా ఉన్నతాధికారులు తీర ప్రాంతాల గ్రామస్తులను అప్రమత్తం చేశారు.
సాయంత్రం ఆరు గంటలకు వంశధారలో ప్రవాహం తక్కువ కావ డం, ఎగువ ప్రాంతం వర్షాలు తగ్గుపముఖం పట్టడంతో అధికా రులు, నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయినటప్పపటికి అప్రమత్తంగా ఉండా లని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో తమ్మిలేరు, ఎర్రకాలువ, జల్లేరు, కొవ్వాడ జలాశయాలు వరద నీటితో కళకళలాడుతున్నాయి. నీటి మట్టాలు క్రమంగా పెరగటంతో ఏ క్షణానైనా సరే ప్రాజెక్టులనుంచి వరద నీటిని దిగువ ప్రాంతాలకు వదిలే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వర్షాల వల్ల ప్రాజెక్టుల పరిధిలో పంట బోదులు, ఆయకట్టు పంట పొలాల్లో వర్షం నీరు నిలిచిపోయి ఉంది.
వరంగల్‌ జిల్లాలోని లక్నవరం, రామప్ప, గణపురం జలాశయాలతో పాటు మల్లూరు నర్సింహాసాగర్‌ ప్రాజెక్టు, పాకాల చెరువులోకి నీరు వచ్చి చేరింది. విజయనగరం జిల్లాలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తు న్నాయి. గరిష్ఠంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చీపురుపల్లి, విజయ నగరం, గజపతినగరం, ఎస్‌.కోటలో అధికంగా వర్షపాతం నమో దైంది. బొబ్బిలి, సీతానగరం, బలిజి పేటలో తక్కువ వర్షపాతం నమోదైంది. పార్వతీ పురం, కొమరాడ, జి.ఎల్‌.పురం తదితర మండలాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఈవర్షాల కారణంగా వాగులు, చెరువులు నిండాయి. రిజర్వాయర్‌ లలో నీరు చేరుతోంది. రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా వున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డెల్టాలో వరి నారుమళ్లు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతాంగం ఆందోళనతో ఉంది. మరోపక్క మెట్టలో కురిసిన వర్షాలతో చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. ఎక్కడా చెరువు గట్లు తెగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ అప్రమత్తం చేసింది. జిల్లా ఇప్పటికే 30శాతం వరకు వరి ఊడ్పులు పూర్తయ్యాయి. మిగిలిన 70శాతం నారుమళ్లు దశలో ఉన్నాయి. తుఫాను కారణంగా అందులో చెరిసగం నారుమళ్లు కుళ్లిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు సైతం భావిస్తున్నారు.
కొత్తగూడెం ఓసీలో నిలిచిన ఉత్పత్తి
మూడు రోజుల నుండి కుండపోతగా వర్షాలు కురవడం వల్ల సింగరేణి ఒపెన్‌ కాస్టులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి శనివారం కొత్తగూడెం సింగరేణి గౌతంఖని ఓపెన్‌కాస్టులోని రెండవ షిప్ట్‌ నుండి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అంతేకాకుండా ఆదివారం సైతం ఓపెన్‌కాస్టులో పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు రోజులకు సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లినట్లు ఒపెన్‌కాస్టు ప్రాజెక్టు అధికారులు ‘మేజర్‌న్యూస్‌’కు తెలిపారు. వర్షం తగ్గుముఖం పడితేనే తిరిగి ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు.
ఓపెన్‌కాస్టులో పేరుకుపోయిన నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. వీటిలో కొన్ని ఒపెన్‌ కాస్టులుకాగా, మరి కొన్ని భూగర్భ గనులు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఒపెన్‌కాస్టు మైన్లలకు ఇబ్బందులు ఎదురవు తుంటాయి. కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరులో ఉన్న ఒపెన్‌కాస్టులలో కూడా ఉత్పత్తికి అంతారాయం ఏర్పడినట్లు తెలిసింది. అదేవిధంగా ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలో కూడా ఉన్న ఓపెన్‌కాస్టులు వర్షానికి పనిచేయడంలేదని సమాచారం.
ఉత్తరాంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు
రెండు అల్పపీడనాల ప్రభావం వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ హెచ్చరి కల కేంద్రం నిపుణులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, చత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరొక అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ రెండు అల్పపీడనాల వల్ల ఉత్తరాంధ్ర, తెలంగాణ ప్రాంతా ల్లోని ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో సాధారణ వర్షాలు పడతాయని చెప్పారు. ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగావళి, వంశధార నదులు పొంగి ప్రవహిస్తున్నాయన్నారు.
అప్రమత్తంగా ఉండండిః సీఎం ఆదేశం
రాష్ట్రంలో ఏకధాటిగాకురుస్తున్న వర్షాలు, వరదల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌వి ప్రసాద్‌ ను ముఖ్యమంత్రి ్‌ కె.రోశయ్య ఆదేశించారు. ఆదివారం ఢిల్లీ నుంచి సిఎం ఉన్నతాధికారులతో టెలిఫోన్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. సాధారణ వర్ష పాతం కంటె ఆదివారం 25 వాతం అధికంగా ఉండడంతో లోతట్టు ప్రాంతా ల పట్ల నిరంతరం దృష్టిసారించి అవసరాలను బట్టి ప్రజలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సిఎం సూచించారు. కలెక్టర్లు, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, వైద్య ఆరోగ్యశాఖల యంత్రాంగం అప్రమ త్తంగా ఉండి అంటువ్యాదులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజధానిలో వరదనీరు నిలిచిపోకుండా చూడాలన్నారు.

Leave a Reply

free website analytics