రిలీజ్‌కు ‘క్యూ’ కట్టిన సినిమాలు

5 heroesడిసెంబర్ రిలీజ్ కు వరుస సినిమాలు క్యూలు కట్టాయి. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్ నటించిన ‘అదుర్స్’, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో డి.రామానాయుడు మనువడు రానా కథానాయకుడు తొలిసారి పరిచయమవుతున్న ‘లీడర్’, నాగార్జున ‘కేడీ’, రవితేజ ‘శంభో శివ శంభో’, వెంకటేష్ ‘నమో వెంకటేశ’ వంటివి ఉన్నాయి. అదనంగా మహేష్ బాబు సినిమా, పవన్ కల్యాణ్ ‘పులి’ నిర్మాణం చివరి దశలో ఉంటాయి. ఇవన్నీ బిగ్ స్టార్స్ సినిమాలే కాకుండా ఒక్కో సినిమా బడ్జెట్ 20 నుంచి 25 కోట్ల వరకూ ఉంది. ఒకవేళ పరిస్థితి మెరుగుపడినప్పటికీ ఈ సినిమాలకు మరో సమస్య ఉండనే ఉంది. ఒకేసారి క్యూలో సినిమాలు ఉండటం వల్ల రిలీజ్ విషయంలోనూ పోటీ అనివార్యం కావచ్చు. ఈ పోటీని నివారించేందుకు సహజంగా నిర్మాతలు ఒక అవగాహనతో ముందుకు వెళ్తుంటారు. ఆ ప్రకారం ఒక్కో సినిమా రిలీజ్ కు కనీసం వారం గ్యాప్ ఉండేలా చూసుకోవడం జరుగుతుంది. తద్వారా ప్రతి సినిమాకి పూర్తి స్థాయి కలెక్షన్లు వచ్చే అవకాశాలుంటాయి. అయితే సినిమా విడుదలలో జాప్యం జరగడమంటే నిర్మాతలు నష్టపోవడమే అవుతుంటుంది. వడ్డీల చెల్లింపు రూపంలో భారీ నష్టాలు చవిచూస్తుంటారు. ఈ పరిస్థితిలో సానుకూల వాతావరణం ఏర్పడే వరకూ వేచిచూసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపింకక పోవచ్చు. దీంతో రిలీజ్ ల ‘క్లాష్’ అనివార్యమై పలువురు తీవ్రంగా నష్టపోనూ వచ్చు.  ప్రస్తుతం నడుస్తున్న ఉద్యమాల ప్రభావంతో రాష్ట్రంలోని దాదాదు అన్ని థియేటర్లలో రోజుకు ఒకటి లేదా రెండు షోలను మాత్రమే ప్రదర్శిస్తున్నారని శ్యాంప్రసాద్ రెడ్డి వాపోయారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఈనెల 21 తెలుగు సినీ నిర్మాతల మండలి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుందని ఆయన వెల్లడించారు.

Leave a Reply