రీపోస్టుమార్టమ్ అవసరం లేదు – హైకోర్టు

high court ap
మావోయిస్టు అగ్రనేత శాఖమూరి అప్పారావు మృతదేహానికి రీపోస్టుమార్టమ్ నిర్వహించనక్కరలేదని హైకోర్టు తేల్చిచెప్పింది. శాఖమూరిని ఉద్దేశపూర్వకంగానే పోలీసులు కాల్చి చంపారని, రీపోస్టుమార్టమ్ నిర్వహించి నిజానిజాలు నిర్థారణ చేయాలని పౌర హక్కుల సంఘం శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, శాఖమూరికి రెండోసారి పోస్టుమార్టమ్ నిర్వహించనక్కరలేదని తేల్చిచెప్పి పిటిషన్ విచారణను వారం పాటు వాయిదా వేసింది. హైకోర్టు అడ్డుకోకపోవడంతో ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం శాఖమూరి మృతదేహాన్ని వరంగల్ జిల్లా ఖానాపూర్ తరలించారు. అక్కడ పోలీసులు శాఖమూరి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. శాఖమూరి అంతిమయాత్రలో పాల్గొనేందుకు విప్లవ సంఘాల నేతలు పలువురు వరంగల్ బయలుదేరి వెళ్ళారు.

Leave a Reply

free website analytics