రేపటి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

rama
భద్రాచలంలోని శ్రీ సీతారామచం ద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వసంతపక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రా రంభం కానున్నాయి.15రోజుల పా టు సాగే ఉత్సవాలకు భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన కూడళ్లలో స్వాగత తోరణాలు, రామాలయం, మిథిలా స్టేడియం ప్రాంగణం తదితర ప్రాంతాల్లో చాందినీ వ్రస్తాలతో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
20న నవమికి అంకురారోపణం
సీతారాముల కల్యాణానికి ఈ నెల 20న అంకురారోపణం చేయనున్నారు. 21న ధ్వజపటభద్రక మండల లేఖనం, గరుఢాదివాసం, 22న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, 23న ఎదుర్కోలు, 24న శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహించనున్నారు. 25న పట్టాభిషేకం, రధోత్సవం నిర్వహిస్తారు.
మంగళవారం నుంచి నిత్య కల్యాణాల నిలిపివేత
వసంతపక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతుండ టంతో ఈ నెల 16 నుంచి మార్చి 30వ తేదీ వరకు నిత్యకల్యాణాలు, దర్బా రు సేవలు ఉండవు. మార్చి 20 నుంచి ఏప్రిల్ 7 వరకు స్వామి వారి ఏకాంత సేవలు నిలిపివేయనున్నారు.

Leave a Reply

free website analytics