రేపు తిరుమల ఆలయంలో ఉగాది ఆస్థానం

Tirupati
తిరుమలేశుని ఆలయంలో మంగళవారం ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు బంగారు వాకిలివద్ద మలయప్పస్వామికి, ఉభయ నాంచారులు, సేనాపతికి విశేష సమర్పణ కావిస్తారు.  రెండు గంటలపాటు పంచాంగ శ్రవణం, దేశకాల వ్యవహారాది పంచాంగ వివరాలను శ్రీనివాసునికి వినిపిస్తారు. ఆ తర్వాత ఆస్థానం నిర్వహిస్తారు.  ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో నిత్యం జరిగే సహస్రదీపాలంకారసేవ మినహా తోమాల-అర్చన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, ఆర్జితబ్రహ్మోత్సవం తదితర సేవలను రద్దుచేశారు.

Leave a Reply