రోశయ్యకు అస్వస్థత – ఢిల్లీకి గీతారెడ్డి

pramarsa
ముఖ్యమంత్రి రోశయ్య హటాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయన స్థానంలో సీని యర్‌ మంత్రి, ఫ్లోర్‌లీడర్‌ గీతారెడ్డికి తాత్కాలిక ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించవచ్చని తెలు స్తోంది. తిరుపతికి వచ్చిన ప్రధాని పర్య టనకు సైతం వెళ్లలేని అనారోగ్యంతో ఉన్న రోశయ్యపై మరింత భారం వేయడం భావ్యం కాదని భావిస్తోన్న అధిష్ఠానం ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగం గానే గీతారెడ్డికి తాత్కాలిక ముఖ్యమంత్రి బాధ్యతలు ఇవ్వనున్నట్లు ఢిల్లీ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధాని కార్య క్రమానికి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉన్నందున పరిపాలనా వ్యవహారాల్లో రోశ య్యకు అనా రోగ్యం ప్రతిబంధకంగా మారిందన్న సంకేతాలు వెళ్లాయంటున్నారు.
బుధవారంఅధిష్ఠానం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన గీతారెడ్డి గురువారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. తాత్కాలిక సీఎంగా ఆమె పేరును గురువారం ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తు తం ఉన్న సమాచారం ప్రకారం.. వయోభారంతో ఇబ్బంది పడుతున్న ముఖ్య మంత్రి రోశయ్య తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత నెలలోనే రెండుసార్లు అస్వ స్థతకు గురయ్యారు. గత 20 రోజుల నుంచి అధికార కార్యక్రమాలకు సైతం బ్రేకుల మీద బ్రేకులు పడుతూ వస్తున్నాయి. సీఎం కాన్వాయ్‌లో స్పెషల్‌ అంబులెన్సు వచ్చింది. మధ్యా హ్నం తర్వాత ఆయన సీఎం పేషీ నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోతున్నారు. అధికారులు, సిబ్బంది సైతం ఆయనను కలిసేందుకు వచ్చిన వారిని త్వరగా పంపించేస్తున్నారు.
పనుల ఒత్తిడి ఎక్కువ కావడం, జగన్‌ వ్యవహారాలు, పెళ్లిళ్లు అధికార-అనధికార కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాల్సి వస్తుండటం తో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. దాని ప్రభావంతోనే ఇటీవలి కాలంలో ఆయనలో అస హనం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అనేక సందర్భా ల్లో ఆయన తూలి పడబోగా, సెక్యూరిటీ కాపాడిన విషయం తెలిసిందే. పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఆయనపై విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నాయని, ప్రతిరోజూ తన కోసం వస్తోన్న సందర్శకులతో ఎక్కువ సేపు మాట్లాడుతున్నారని, దానితో గొంతు నొప్పి కూడా ఎక్కువయిందని ఆయన సన్నిహితులు వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. ఏడుపదులు దాటిన రోశయ్యను రాష్ట్రంలో పార్టీ పరిస్థితి చక్కబడే వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగాలని అధిష్ఠానం ఏడాది క్రితం ఆదేశించిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తు న్నాయి. ఈ వయసులో జగన్‌ వ్యవహారంలో అన్ని వైపుల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లను తట్టుకోలేక రోశయ్య ఆందోళన పడుతున్నారని, దానికితోడు స్వతహాగా ఉన్న అనారోగ్యంతో ఆయన పరిపాలనపై ఎక్కువ దృష్టి సారించలేకపోతున్నారని అధిష్ఠానం అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు.
తరచూ అనారోగ్యానికి గురవుతున్న రోశయ్యపై మరింత ఒత్తిడి పెంచడం భావ్యం కాదని, ఆయనకు తగిన విశ్రాంతి ఇవ్వాలని కూడా నాయకత్వం చాలాకాలం నుంచే భావిస్తోంది. దానికి తగినట్లుగానే ఆయన హటాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో రాష్ట్ర పరిపాలనపై నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చిందని నాయకత్వం భావించింది. ఇక రోశయ్య ఈ వయసులో పరిపాలన బాధ్యతలు మోయలేరని, ప్రధాని కార్యక్రమానికి సైతం హాజరు కాలేనంత అనారోగ్యం పాలవడంతో.. పరిపాలనలో రోశయ్యకు ఆరోగ్యం, వయసు సహకరించడం లేదన్న సంకేతాలు అందుకుంది. అందుకు అనుగుణంగానే గీతారెడ్డిని ఢిల్లీకి పిలిపించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రోశయ్యకు కొంత కాలం పూర్తి విశ్రాంతినిచ్చి, ఆయన స్థానంలో గీతారెడ్డిని తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆమె నియామకంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కొంతమేరకు తీర్చినట్లు ఉంటుందని నాయకత్వం అంచనా వేస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. దానివల్ల ఉద్యమం కొంతవరకూ చల్లబడుతుందని అంచనా వేస్తోంది. అదీకాకుండా.. మహిళ, దళితవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో గీతారెడ్డి నియామకంతో పార్టీకి సైతం అనేక రకాల రాజకీయ ప్రయోజనాలు నెరవేరతాయంటున్నారు. అయితే.. ముఖ్యమంత్రి రోశయ్య తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గీతారెడ్డి ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరిస్తున్నందున.. సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేస్తున్న సందర్భంలో ఆమె పేరును ప్రతిపాదించేందుకు రోశయ్య ప్రతినిధిగా మాత్రమే గీతారెడ్డి ఢిల్లీ వెళ్లినట్లు రోశయ్య వర్గీయులు చెబుతున్నారు.

Leave a Reply

free website analytics