రోశయ్యకు లేని బాధ, చంద్రబాబునాయుడుకు ఎందుకు – చవాన్‌

Chawan
బాబ్లీపై ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి రోశయ్యకు లేని బాధ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుకు ఎందుకని చవాన్‌ ప్రశ్నించటంతో ముఖ్యమంత్రి రోశయ్య ఆత్మ రక్షణలో పడవలసి వచ్చింది. చవాన్‌ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్‌ నేతలు కూడా ఆగ్రహంతో రగిలిపో తున్నారు.  బాబ్లీపై పోరాడుతూ జైలుకెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన బృందాన్ని రాష్ట్రానికి తర లించడంతో హాయిగా ఊపిరిపీల్చుకున్న ముఖ్యమంత్రి రోశయ్య, కాంగ్రెస్‌ పార్టీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ వ్యాఖ్యలు ఇరుకునపెట్టాయి.
చవాన్‌ తమను రాష్ట్ర ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టారని మండిపడుతున్నారు. బాబ్లీకి సంబంధించి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం తమను ఇంతవరకూ ఎలాంటి వివ రాలు అడగలేదని, ప్రతిపక్షమే అన్ని ప్రశ్నలూ వేస్తోందని, ఆంధ్ర ప్రభుత్వానికి లేని బాధ ప్రతిపక్షానికి ఎందుకని చవాన్‌ ప్రశ్నించడం ముఖ్యమంత్రి రోశయ్య సహా, కాం గ్రెస్‌ పార్టీని ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ ేసింది. అక్కడ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్యమంత్రే స్వయంగా బాబ్లీపై ముఖ్యమంత్రి రోశయ్యకు చిత్తశుద్ధి లేదని చెప్పకనే చెప్పినట్టయింది. అదే సమయంలో బాబ్లీపై టీడీపీ ఒక్కటే మాట్లాడుతోందని, ఆంధ్ర ప్రభుత్వం కనీసం వాటి వివరాలు కూడా తమను అడిగే ఆసక్తి ప్రదర్శించడం లేదని చవాన్‌ తన వ్యాఖ్యల ద్వారా తేల్చిచెప్పారు.
ఇదే విషయాన్ని ఇప్పటివరకూ చెబుతూ వస్తున్న టీడీపీ నాయకులకు తాజాగా చవాన్‌ చేసిన వ్యా ఖ్యలు రోశయ్య సర్కారుపై ఎదురుదాడికి కొత్త ఆయుధం ఇచ్చినట్టయింది. బాబ్లీ అక్రమ కట్ట డాలకు సంబంధించిన ఫొటోలు కూడా ముందు తామే తీసి, ప్రభుత్వానికి ఇచ్చే వరకూ దాని గురించి నాటి వైఎస్‌ సర్కారుకు తెలియదని చెబుతూ వస్తోన్న బాబు వాదనకు చవాన్‌ ప్రకటన తో మరింత బలం చేకూరినట్టయింది. మరోవైపు.. అశోక్‌ చవాన్‌ చేసిన వ్యాఖ్యలతో బాబ్లీపై ఇప్పటికే తారాస్థాయికి చేర్చిన పోరాటాన్ని మరింత పదునెక్కించేందుకు తెలుగుదేశం పార్టీకి వీలుకలిగింది.
స్వయంగా చవానే రాష్ట్ర ప్రభుత్వానికి బాబ్లీపై ఆసక్తి లేదని, ప్రతిపక్షమే పోరా డుతోందని క్లీన్‌చిట్‌ ఇచ్చిన తర్వాత ఇక ఎదురుదాడికి మరింత పదునుపెట్టాలని నిర్ణయించింది. కాగా, చవాన్‌ తమను ఇరుకునపెట్టారని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతు న్నారు. చవాన్‌ తమను రక్షించవలసింది పోయి, ప్రతిపక్షమైన టీడీపీ ఒక్కటే బాబ్లీ కోసం మాట్లాడుతుందని స్వయంగా క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత పార్టీ ప్రభుత్వమే ఈవిధంగా భవిష్యత్‌ పరిణామాలు ఆలోచించకుండా అడ్డగోలుగా మాట్లాడితే ఇక తాము ఏ విధంగా టీడీపీపై ఎదురుదాడి చేయాలని వాపోతున్నారు. ఒకవేళ తాము ఎదురుదాడి చేసినా, స్వయంగా మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రే ‘మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ బాబ్లీపై వివరాలు అడగలేదని’ చెప్పిన వైనాన్ని టీడీపీ ప్రశ్నిస్తే వాటిని ఎలా తిప్పికొట్టాలని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply