రోశయ్యది దురదృష్టకర పాలనే – రాఘవులు

b-v-raghavulu
రోశయ్య ఏడాది పాలన దురదృష్టకరమైన పాలనే. దీనికి పునాది గత ఆరేళ్ల పాలనలోనే పడింది. అప్పటి పాలన పర్యవసానాన్ని ఈ ఏడాది చూస్తున్నాం. ఆ కాలంలో చేసిన తప్పులను ముఖ్యమంత్రి రోశయ్య సరిదిద్దనన్నా దిద్దాలి.. లేదా తిరస్కరించాలి’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన తప్పులకు తాను కారణం కాదని రోశయ్య స్పష్టం చేయాలని, లేకుంటే బాధ్యత వహించాలని అన్నారు.  పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం రాఘవులు మీడియాతో మాట్లాడారు. ‘రోశయ్య దురదృష్టవంతుడో, అదృష్టవంతుడో.. గతంలోనే వైఫల్యాల బీజాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అవి తీవ్రమయ్యాయి. ఐదేళ్ల కిందటే జలయజ్ఞానికి ఈ పరిస్థితి వస్తుందని చెప్పాం. ఆరోగ్యశ్రీ కార్పొరేటు ఆసుపత్రులకే మేలు చేస్తుందన్నాం. అదే నిజమైంది.  ఇందిరమ్మ ఇళ్ల పథకం అనుయాయులకు డబ్బులు పంచడానికేనని, ఇళ్లు పూర్తి చేయరు.. మెండిగోడలే మిగులుతాయని చెప్పాం. అదే జరిగింది’ అని అన్నారు. కాగా, జ్వరం బారిన పడిన రోశయ్య త్వరగా కోలుకోవాలని, ముఖ్యమంత్రిగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుక జరుపుకోవాలని రాఘవులు ఆకాంక్షించారు.

Leave a Reply

free website analytics