లగడపాటికి రాష్ట్ర బాగోగులు పట్టవు – హరీష్‌రావు

an-1262638805085
రాష్ట్రం విద్యుత్‌ సమస్యతో అల్లాడుతుంటే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన సంస్థలో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రత్యేక అధికారాలను ఉపయోగించి లాంకో కంపెనీ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు వాడుకోవాలని ఆయన కోరారు. ఓట్లేసి గెలిపించిన విజయవాడ ప్రజల కష్టాలు కూడా లగడపాటికి పట్టవని, విజయవాడలో కూడా తీవ్ర విద్యుత్‌ కోత ఉందని హరీష్‌రావు అన్నారు.

Leave a Reply

free website analytics