లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌తో సియాగ్రామ్ ఫ్యూయల్ ఒప్పందం

ప్రఖ్యాత ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌తో వైన్స్, స్పిరిట్స్ అగ్రగామి సంస్థ అయిన పెర్నాడ్ రికార్డ్‌కు చెందిన సియాగ్రామ్స్ ఫ్యూయల్ బ్రాండ్ జట్టు కట్టింది. భారతీయ ఫుట్‌బాల్ అభిమానులకు ఉత్తేజాన్ని ఇచ్చేలా వీటి మధ్య అనుబంధం కుదిరింది. పెర్నాడ్ రికార్డ్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ (మార్కెటింగ్) విక్రమ్ బసు ఈ ఒప్పంద విశేషాలను వెల్లడించారు. భారత్‌లో క్రీడలకు సంబంధించి ఫ్యూయల్ బ్రాండ్ ఈ విధమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ నిపుణులైన ఆటగాళ్ళను కలిగిఉందని కితాబునిచ్చారు.
లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ కమర్షియల్ డైరెక్టర్ ఇయాన్ ఆరె మాట్లాడుతూ బార్‌క్లేస్ ప్రీమియర్ లీగ్, మరీ ముఖ్యంగా లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ భారత్‌లో ప్రాచుర్యం పొందుతున్నదనేందుకు ఈ ఒప్పందమే నిదర్శనమని అన్నారు. భారతీయ ఫుట్‌బా ల్ అభిమానులను అలరించేందుకు తాము కట్టుబడి ఉన్నామనేందుకు ఈ ఒప్పందమే ప్రతీక అని పేర్కొ న్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన అత్యంత విజయవం తమైన జట్టుగా లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ 40 ప్రముఖ అవార్డులను పొందింది. ఎప్పటికప్పుడు పటిష్ఠమవుతూ వచ్చిన తమ క్లబ్ నూతన, వినూత్న భాగస్వామ్యాల కోసం చూస్తోందన్నారు. లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌లో ఎంతో మంది ప్రఖ్యాత ఆటగాళ్ళు ఉన్నారని, క్లబ్‌కు ఎంతో ఉన్నత స్థాయి చరిత్ర ఉందని పేర్కొన్నారు.




