లోక్ సభ 2 గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్
లోక్ సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. మహిళా బిల్లుపై రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్ వాదీ పార్టీ సభ్యులు సభలో తీవ్ర గందరగోళం సృష్టించడంతో స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే, ఎస్పీ, ఆర్జేడీ సభ్యులు ఆందోళనకు దిగారు. మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. బిల్లుపై నిరసన తెలిపగా తమను మార్షల్స్ తో బయటకు గెంటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేసారు. సభ సజావుగా సాగకుండా పదే పదే అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ మీరాకుమారి సభను మధ్యాహ్వాం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.




