వారసత్వ పోటీ అవినీతికా?నేర చరిత్రకా? – బాబు

an-1271620246996
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ముఖ్యంగా వైఎస్ పాలనలో అవినీతి పెచ్చుమీరిపోయిందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండోరోజు పర్యనటలో వైఎస్‌పై నిశిత విమర్శలు చేశారు. టీడీపీ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  తొమ్మిదేళ్ల తన పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దోచుకోవడం మొదలైందని, అలాంటి నాయకుని వారసత్వం కోసం ఆయన కుమారుడు జగన్, కాంగ్రెస్ పోటీ పడుతున్నట్లు విమర్శించారు. ‘ఈ పోటీ రాజశేఖర్‌రెడ్డి నేరచరిత్ర వారసత్వానికా లేక అవినీతి వారసత్వానికా’ అని సూటిగా ప్రశ్నించారు.  టీడీపీ పాలన ఫలితంగా రాష్ట్రంలో పెరిగిన ఆదాయాన్ని రాజశేఖర్‌రెడ్డి హయాంలో వివిధ రకాలుగా దోచుకున్నారన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే 111 సెజ్‌లు స్థాపించి రైతులను భూమిలేనివారిగా మార్చారన్నారు. 196 మంది టీడీపీ కార్యకర్తల్ని బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దీనికి ఎవరు బా««ధ్యత తీసుకుంటారు? జగనా.. కాంగ్రెసా?’ అని ఆగ్రహంతో ప్రశ్నించారు.  వ్యక్తి చనిపోయినంత మాత్రాన వారి నేరాలు మాఫీ కావంటూ… పరోక్షంగా వైఎస్ సానుకూల ప్రచారాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారు.

Leave a Reply

free website analytics