విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించాలి
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కపిల్‌దేవ్ గ్రిగ్స్ పోటీలు ప్రారంభంకు ముఖ్యఅతిధిలుగా ఎమ్మెల్యే పరిటాలసునీత , మాజీ జెడ్పి ఛైర్మన్ తోపుదుర్తి కవితాభాస్కర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడలను వారు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కపిల్‌దేవ్ గ్రిగ్స్ పోటీలు నిర్వహించడం గ్రామీణ విద్యార్థుల్లో దాగి వున్న క్రీడ ప్రతిభను గుర్తించడానికి ఎంతో దోహదపడుతాయన్నారు. ప్రతి విద్యార్థి చదవులతో పాటు క్రీడల పై దృష్టిసారించాలన్నారు. గ్రామీణ స్థాయి విద్యార్థుల్లో వున్న క్రీడ ప్రతిభను గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలన్నారు. క్రీడల్లో విజేతులుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానంకు స్వర్గీయ పరిటాల రవీంద్ర మోమోరియల్ ట్రస్టు ద్వారా సామాగ్రి దాదాపు లక్ష రుపాయలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మధు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు మల్లన్న, చంద్రశేఖర్‌రెడ్డి, టిడిపి మండల కన్వీనర్ వేణుగోపాల్, టిడిపి నాయకులు పుల్లయ్య, గ్యాస్‌శీనా, ఓబుళపతి, సూరి, రవి, హెడ్‌మాస్టర్ అనురాధ, పిఇటి, ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు




