విద్యుత్‌సౌథలో లిఫ్టులో చిక్కుకున్న చిరంజీవి
విద్యుత్‌కోత కారణంగా చిరంజీవి లిఫ్టులో చిక్కుకుపోయి కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన ఎక్కడో జరిగితే పెద్దగా పట్టించుకోనవసరం ఉండేది కాదు. ఎందుకంటే రాష్ట్రంలో ఆకస్మిక విద్యత్ కోత సాధారణమై పోయింది కాబట్టి-. కానీ చిరంజీవి ఎక్కడ చిక్కుకున్నారంటే విద్యుత్ సౌధ ప్రధాన కార్యాలయంలో. ఆశ్చర్యమే కదూ… రాష్ట్రంలో విద్యుత్ కోతకు నిరసనగా చిరంజీవి ఆధ్వర్యంలో పిఆర్పీ శ్రేణులు మంగళవారం విద్యుత్‌సౌథ ముందు ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా సంస్థలో ని తెలంగాణ ఉద్యోగులు చిరంజీవిని అడ్డుకున్నారు. చిరంజీవి సమైక్యవాదానికి మద్దతు తెలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగులు చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనితో చిరంజీవి కొంత సంకటస్థితిని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఎలాగోలా విద్యుత్‌సౌథ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. తిరిగి వచ్చేప్పుడు ఆకస్మికంగా విద్యుత్ ప్రసారం నిలిచిపోవడంతో చిరంజీవి లిఫ్టులో చిక్కుకుపోయారు. దీనితో కొంతసేపు ఆందోళన, గందరగోళం నెలకొన్నది.




