వైఎస్ పధకాలు కొనసాగిస్తాం – రోశయ్య

దివంగత సీఎం వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని సీఎం రోశయ్య పునరుద్ఘాటించారు. అర్హులందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పా రు. తన ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ వైఎస్ పథకాల అమలుకు కంకణబద్ధుడినయ్యానని చెప్పారు. వైఎస్ మరణానంతరం రా ష్ట్రంలో కరువు, వరదలు, ఉద్యమాలు వంటి విపత్తులు ఏర్పడినా.. అధిగమించి ముందుకు వెళుతున్నామన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు బాగుందన్నారు.
ఇటీవలే రాష్ట్రంలో అతి పెద్ద పీఎస్‌యూ మన్నవరం ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రధాని 9శంకుస్థాపన చేశారని.. మెట్రో రైలు ప్రాజెకు నిర్మాణానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ సందర్భంగా తన సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాగా సీఎం రోశయ్య ఏడాదిపాలనను సమీక్షిస్తూ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్ రాసిన ‘ప్రగతి బాటలో రోశయ్య పాలన’ పుస్తకాన్ని మంత్రి గీతారెడ్డి ఆవిష్కరించారు. సీఎం నివాసంలో ఆయన సమక్షంలో నిరాడంబరంగా జరిగిన ఆవిష్కరణోత్సవానికి ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదకుడు వల్లీశ్వర్, ప్రెస్అకాడమీ కార్యదర్శి నాగయ్య కాంబ్లే, పాలకమండలి సభ్యుడు తిలక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రచయితను అభినందించారు. గీతారెడ్డి కూడా మాట్లాడారు.




