వైఎస్‌ఆర్‌ పోస్టల్‌ స్టాంప్‌ ఆవిష్కరణ

03.09.05
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృత్యర్ధం తపాలశాఖ ఆయన పోస్టల్‌ స్టాంపును తొలి వర్ధంతి సందర్భంగా బుధవారం విడుదల చేసింది. విశాఖవాసి జి దుర్గాప్రసాద్‌ రూపొందించిన ఈ స్టాంపును విశాఖ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ శారదాసంపత్‌ అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా ఫిలాటరీ బ్యూరో ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. అతి తక్కువ సమయంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ప్రథమ వర్ధంతినాటికి ఈ స్టాంపు విడుదలయ్యేలా రూపకర్త దుర్గాప్రసాద్‌ చేసిన కృషి అభినందనీయమన్నారు. 2.54 లక్షల విలువ గల పోస్టల్‌ ప్రొడక్షన్‌ ఆర్డర్‌ను సాధించిన ఘనత దుర్గాప్రసాద్‌కు దక్కుతుందన్నారు. రెండుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజల మనిషిగా వైఎస్‌ కీర్తిని ఆర్జించారన్నారు. విశాఖ రీజినల్‌ పోస్టల్‌సర్వీస్‌ డైరక్టర్‌ వై ఉపేంద్ర మాట్లాడుతూ, పోస్టల్‌ స్టాంపురూపకల్పనలో తెలుగువారికి అవకాశంకలగడం అభినం దనీయమన్నారు. విశాఖ నగరాన్ని వైఎస్‌ఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపించి అభివృద్ధి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో స్టాంపు రూపకర్త దుర్గాప్రసాద్‌, యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ శర్మ, విశాఖ ఫిలాటలీ అధ్యక్షుడు డిఎంకె భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

free website analytics