వైఎస్ కళలకు సాకారం – మండలి చెర్మెన్ చక్రపాణి

వైఎస్‌ఆర్ కళలు కన్న హరితాంధ్ర ప్రదేశ్‌ను సాధిస్తామని మంత్రులు వెల్లడించారు. ఆత్మకూరు సమీపంలోని నల్లకాల్వ వద్ద గురువారం దివంగత నేత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని స్మృతివనంలో శాసనమండలి చైర్మన్ చక్రపాణి యాదవ్ ఆవిష్కరించారు. అనివార్య కారణాల వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ఈ ఆవిష్కరణకార్యక్రమానికి గైర్హాజరు కావడంతో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, శిల్పామెహన్ రెడ్డి, డొక్క మాణిక్య వరప్రసాద్, వట్టి వసంతకుమార్‌లు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ అనంతరం సిఎం పంపిన సందేశాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి డొక్క మాణిక్య వర ప్రసాద్ చదివారు.
ప్రత్యేక బంధాన్ని ఏర్పర్చుకున్న అసాధారణ నాయకుడు వైఎస్‌ఆర్ అని రోశయ్య సందేశంలో పేర్కొన్నారు. ప్రకృతివనంలో స్మృతివనానికి చుట్టామని పేర్కొన్నారు. అభివృద్దికి అవిశ్రాంతంగా శ్రమించారని సమస్య ఉంటే పరిష్కారం అయ్యేదాక వదిలే వారు కాదని సందేశంలో పేర్కొన్నారు. 1978 నుంచి వైఎస్‌తో మంచి అనుబంధం ఉందని, 30ఏళ్ళుగా ఓటమి చూడని నాయకుడని రోశయ్య సందేశంలో పేర్కొన్నారు. రైతులకు రుణమాఫిలో రాష్ట్రానికి 13 వేల కోట్లు మాఫి చేయించిన మహానేత వైఎస్ అని పేర్కొన్నారు. అటవీ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడుతూ స్మృతివనం ఏర్పాటుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకొని రూ. 23 లక్షలతో 22 ఎకరాల స్థలంలో స్మృతివనం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అభయారణ్యంలోని 3500 ఎకరాల్లో కేవలం అటవీ పనులు చేపట్టేందుకు కేంద్ర అనుమతి కోసం పంపించామన్నారు. వైఎస్‌ఆర్ రెండవ వర్ధంతి నాటికి ఇక్కడ స్మృతివనం పనులు పూర్తి చేస్తామన్నారు.
ఇడుపుల పాయలో 26కోట్లతో స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ కన్న కళలను సాకారంచేసేందుకు రోశయ్య మంత్రి వర్గం పట్టుదలతో ఉంద న్నారు.వైఎస్‌ఆర్ పథకాలన్ని అమలు చేస్తామన్నారు. విగ్రహావిష్కరణ చేసిన శాసన మండలి చైర్మన్ చక్రపాణి యాదవ్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ఆశయాలను అన్ని విధాలుగా స్మృతివనాన్ని అభివృద్ది చేయాలని ఆకాంక్షించారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ అభివృద్ది , సంక్షేమం, ఉపాధి ఆదర్శంగా అనేక పథకాలను వైఎస్‌ఆర్ రూపొందించారన్నారు. సంక్షేమం అభివృద్దికి రాజీలేకుండా అభివృద్ది చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు మంత్రులందరు కట్టుబడి ఉన్నామన్నారు.
పేదలను ఆదుకోవడం, ఇందిరమ్మ రాజ్యస్థాపనే ధ్యేయంగా వైఎస్‌ఆర్ పనిచేశారన్నారు. గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి వట్టి వసంత కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద వైఎస్ మృతిని తమ కుటుంబ పెద్దను కోల్పోయినట్లుగా ఉన్నారన్నారు. వైఎస్ గురించి ఎన్ని మాట్లాడినా తక్కువేనన్నారు. వైఎస్‌ఆర్ ఆత్మశాంతి కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తామని ప్రమాణం చేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ను కించ పర్చే విధంగా ఎవరూ మాట్లాడవద్దని కోరారు. మంత్రులు నేరుగా హైదరాబాద్ నుంచి ఉదయం 11.16 గంటలకు హెలిక్యాప్టర్‌లోస్మృతివనానికి చేరారు. వీరిని గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఏరాసు ప్రతాప రెడ్డి, నందికొట్కూరు శాసన సభ్యులు లబ్బి వెంకటస్వామి తదితరులు స్వాగతం పలికారు.
స్మృతివనంలోకి అడుగు పెట్టాక మొదట స్మృతివనం ఫోటో ఎగ్జిబిషన్‌ను , నమూనాను మంత్రులు తిలకించారు. విగ్రహావిష్కరణ అనంతరం మధ్యాహ్నం 12.16 గంటలకు హెలిక్యాప్టర్‌లో నంద్యాలకు బయలు దేరి వెళ్ళారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లా నాయకులు గంగుల ప్రభాకర్ రె డ్డి, పెసల శ్రీనివాసులు శెట్టి, చెల్లా భగీరథ రెడ్డి, పిపి. నాగిరెడ్డి, కాతా అంకిరెడ్డి, మాజి ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, అంబాల ప్రభాకర్ రెడ్డి, తదితర నాయకులు హాజరయ్యారు. మంత్రుల రాకతో జిల్లా కలెక్టర్ రామ్‌శంకర్ నాయక్, ఎస్పీ శ్రీకాంత్, డిఐజి అనిల్‌కుమార్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ లక్ష్మికాంతం, ఆర్డిఓ బాలయ్యలు పాల్గొన్నారు.




