సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకోండి – చంద్రబాబు

an-1268250674901
రానున్న రోజుల్లో విద్యారంగం ప్రధాన పాత్రను పోషించ నున్నదని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు.పిల్లలను ఉన్నతమైన విద్యావం తులను చేసేందుకు సమాజంలోని తల్లితండ్రులు అనేక కష్టాలు పడుతున్నారనీ, పిల్లల చదువుపైనే వారు దృష్టంతా సారిస్తున్నారని ఆయన అన్నా రు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జన్మదినమైన సెప్టెంబర్‌ 5ను దేశవ్యాప్తంగా గురుపూజో త్సవాన్ని జరుపుకుంటున్నామనీ, ఈ సందర్భం గా ఆయన స్మృతులను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు చెప్పారు. గురుపూ జోత్సవం సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్టు ఆదివారం ఉత్తమ అధ్యాపకులను సత్కరించింది. వీరిని ఎన్టీఆర్‌ మేనేజింగ్‌ ట్రస్టీ చంద్రబాబు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన ఉండాలనీ, ముందుచూపుతో విద్యావ్యవస్థ ఉత్తమ మార్గాన్ని చూపించాలని ఆలోచించిన వ్యక్తి రాధాకృష్ణ అని కొనియాడారు. ఉపాధ్యాయులు మంచి పునాదిని పిల్లలకు అందించినపుడే వారు ఉత్తమ పౌరులుగా, ఆదర్శవంతులుగా తయారవుతారని చెప్పారు. పిల్లలు బాగా చదివినపుడే, ఉత్తమ పౌరుడిగా ఎదిగినపుడే రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు వస్తుందని తెలిపారు. ఉపాధ్యా యులు తమ హక్కులు, డిమాండ్‌లు, సంక్షేమం కోసం ఉద్యమిస్తూనే మరోవైపు పిల్లల భవిష్య త్తుపై దృష్టి సారిస్తున్నారని అభినందించారు. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లల చదువులపై నిర్లక్ష్యం చేయవద్దని ఆయన ఉపాధ్యాయులకు హితవు పలికారు. తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్వి వర్ల రామయ్య స్వాగతోపన్యాసం చేస్తూ ప్రతీయేటా ఎన్టీఆర్‌ ట్రస్టు ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరిస్తుందని చెప్పారు. సమాజానికి ఉపాధ్యాయులు వెన్నముక లాంటివారనీ, వారి నిరంతర కృషి వల్లే యువతరం నేడు అన్ని రంగాల్లో రాణిస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మోటపర్తి వెంకట్‌, ట్రస్టు సలహాదారులు డాక్టర్‌ సిఎల్‌ వెంకట్రావు, బిఐ చౌదరి, తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు నర్సిరెడ్డి, తెలుగునాడు ఉపాధ్యాయసంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.దమనేశ్వరరావు ఇందులో పాల్గొన్నారు.
ఒక్కో జిల్లా నుంచి ఒక ఉపాధ్యాయుని ఎంపిక
రాష్ట్రంలో ఒక్కో జిల్లా నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా నిర్ణయించి వారిని ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్టు సత్కరించింది. వీరికి చంద్రబాబు శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందచేసి ప్రశంసాపత్రాన్ని బహుకరించారు.

Leave a Reply

free website analytics