సిఎం పర్యటనకు భారీ బందోబస్తు -ఎస్పీ శ్రీకాంత్‌

Copy of Srikanth_Srikakulamముఖ్యమంత్రి రోశయ్య నంద్యాల పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీకాంత్‌ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముఖ్య మంత్రి పర్యటన ఏర్పాట్ల సందర్భంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నంద్యాలకు సెప్టెంబర్‌ 2న వస్తున్న సందర్భంగా ఆయన ప్రారంభోత్సవాల ప్రాంతాల్లో గట్టి బందోబస్తుకు సుమారు 1000 మంది పోలీసులను ఏర్పాటు చేశామని అన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో గతంలో మావోలు సంచరిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కూంబింగ్‌ ముమ్మరం చేశామన్నారు. బాంబు స్వ్కాడ్‌ తనిఖీలు చేపడుతున్నామని అన్నారు. రాత్రి వేళల్లో ప్రతి వాహనాన్ని తనిఖీలు చేపట్టామని అన్నారు. అలాగే పట్టణంలోని అనుమానాస్పద వ్యక్తుల పై గట్టి నిఘాను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రధానంగా హెలిప్యాడ్‌, ప్రథమనందీశ్వర, వై జంక్షన్‌, వైఎస్సార్‌ నగర్‌ ప్రాంతాలతోపాటు ఆత్మకూరు మండలంలోని స్మృతి వనం వద్ద ప్రత్యేక పోలీసులను నియమించామన్నారు. కేంద్ర బలగాలు కూడా రెండు రోజుల నుండి నంద్యాలలో మకాం వేసి పరిస్థితులు అంచనా వేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాల్లో ప్రజలకు అనుమతులు లేవని, సుమారు వంద అడుగుల దూరం నుండి ప్రజలు చూసే విధంగా భారీ గేట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసే ప్రదేశాల్లో ఎస్పీతోపాటు డిఎస్పీ సమయ్‌ జాన్‌ రావు, సిఐలు వీరరాఘవరెడ్డి, శ్రీనివాసులు, గుమ్మడి రవికుమార్‌, ఎస్సైలు ప్రవీణ్‌కుమార్‌, కంబగిరిరాముడు, వాసు కృష్ణ, ఆలం తదితరులు ఉన్నారు.

Leave a Reply

free website analytics