సిద్ధార్థ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్న ఆందోళనకారులు

siddartha-400హీరో సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న బద్మాష్ చిత్రం షూటింగ్‌ను బుధవారం తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. వనస్థలిపురంలో షూటింగ్ జరుగుతుండగా కొంత మంది ఆందోళనకారులు నినాదాలు చేస్తూ అక్కడికి చేరుకున్నారు. దీనితో షూటింగ్ నిలిచిపోయింది. అయితే అప్పుడే యూనిట్‌లోని ఓ కెమెరామెన్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పోలీసులు రంగ ప్రవేశం చేసి షూటింగ్‌ను అడ్డుకున్న ఆందోళనకారులను, అనుమతి లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్‌ను అదుపులోకి తీసుకున్నారు. బద్మాష్ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

Leave a Reply