సీమలో ప్రశాంతం – ఐజీ ఠాకూర్
ప్రస్తుతానికి సీమాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని రాయలసీమ ఐజీ ఠాకూర్ ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఎప్పుడు లేనటువంటి ఉద్యమాలు చోటుచేసుకున్నాయి. అయితే వాటిని తమ సిబ్బంది చాకచక్యంగా ఎదుర్కోన్నారని, చిన్న చిన్న సంఘటనలు మినహా సీమలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, ప్రజలుకుడా దీనికి సహకరిస్తున్నారని, విద్యార్థులు కూడా ఒక్కొ దశలో ఆగ్రహావేశాలకు లోనవడం మినహా అన్ని సమయాల్లో పోలీసులకు సహకరిస్తునన్నారని, పోలీసులు కూడా వారి ఆందోళనలు దృష్టిలో ఉంచుకొని సంయమనంతో వ్యవహరిస్తున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో అరెస్టు చేయడం మినహా ఎలాంటి చర్యలకు తాము పాల్పడలేదని, టిడిపి వారి దీక్ష శిబిరాలను కూడా పరిశీలించడం జరిగిందని వారి ఆరోగ్య దృష్ట్య వారిని దీక్ష విరమించమని ఎస్పీ ద్వారా విన్నవించడం జరిగిందని, ఎమ్మెల్యేలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే ప్రజలు ఆగ్రహావేశాలకు లోను కావద్దని, పరిస్థితులను దృష్టిలో వుంచుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వారి నిరసనలు, ఆందోళనలు ఉండాలని విజ్ఞప్తి చేశారు.




