సెమీస్‌లో జర్మనీ

gerBజర్మనీ ప్రపంచకప్‌ హాకీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం పూల్‌-ఎలో జరిగిన తొలి మ్యాచ్‌లో జర్మనీ 5-2 గోల్స్‌ తేడాతో న్యూజిలాం డ్‌ను ఓడించి సెమీస్‌ బెర్త్‌ను దక్కించుకొంది. ప్రారంభం నుంచే జర్మనీ ఎటాకింగ్‌ గేమ్‌తో కివీస్‌ను హడలెత్తించింది. సమన్వయంతో ఆడుతూ ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌లోకి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించింది. వరుస దాడులతో ప్ర త్యర్థి జట్టును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆట 15వ నిమిషంలో క్రిస్టోఫర్‌ జర్మనీకి తొలి గోల్‌ అందించాడు. మరో 8 నిమిషాల తర్వాత జర్మనీకి మరో ఛాన్స్‌ లభించింది. అయితే గోల్స్‌ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. అయితే 28వ నిమిషంలో ఫ్లోరియన్‌ ఫుచ్స్‌ జట్టుకు మూడో గోల్‌ అందించాడు. దీంతో తొలి అర్ధ భాగంలో జర్మనీ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో కూడా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జోరు కొనసాగింది. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా ఎటాకింగ్‌ గేమ్‌ ఆడింది. దీంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది.  47వ నిమిషంలో ఫిలీప్‌ విట్‌ జర్మనీకి మూడో గోల్‌ అందించాడు. ఈ సమయంలో కివీస్‌ విజృంభించింది. 50వ నిమిషంలో మికాలిస్‌ జట్టుకు తొలి గోల్‌ అందించాడు. పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసిని మికాలిస్‌ జట్టుకు గోల్‌ సాధించి పెట్టాడు. మరో 4నిమిషాల తర్వాత నికోలస్‌ కివీస్‌కు రెండో గోల్‌ అందిం చాడు. దీంతో జర్మనీ ఆధిక్యం 3-2కు తగ్గింది. అంతేగాక మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. ఈ షాక్‌ నుంచి తేరుకున్న ప్రపంచ ఛాంపియన్‌ జర్మనీ వెంటవెంటనే మరో రెండు గోల్స్‌ సాధించి ఘన విజయం అందుకొంది. 63వ నిమిషంలో మోరిట్జ్‌ ఫుర్‌స్టె, 64వ నిమిషంలో మాథ్యూస్‌ విథాస్‌ జట్టుకు గోల్స్‌ సాధించి పెట్టారు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న జర్మనీ 5-2తో గెలిచి సెమీస్‌కు చేరుకొంది.

Leave a Reply

free website analytics