సోనియాపై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు – డిఎస్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దే పనిని కేంద్రానికి వదిలేద్దామని డిఎస్ సూచించారు. సీమాంధ్ర నేతలు దీక్షలు విరమించాలని కోరారు. పార్టీ అధిష్టానం ఎవరికీ అన్యాయం చేయదని, అందరికీ న్యాయం చేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పాలన స్థంభించలేదని, ఆందోళనల వల్ల కాస్త ఇబ్బంది తలెత్తిన మాట వాస్తవమేనని అన్నారు. పార్టీ అధినేత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తప్పవని, ఎప్పటికప్పుడు రాష్రంలో ఏం జరుగుతుందో హైకమాండ్‌కు అందుతోందని ఆయనన్నారు.




