‘ధిక్కార యాత్రలో సియంపై విమర్శనాస్ర్తలు సందించిన బాలినేని

కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓదా ర్పు క్రమంగా ధిక్కార యాత్రగా మారు తోంది. రాష్ట్ర మంత్రి, వైఎస్ సమీప బంధు వయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఓదార్పు యాత్ర వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్య మంత్రి అయితే తప్ప వైఎస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు కొనసాగవని విస్పష్టంగా ప్రకటించారు. ఇది నేరుగా రోశయ్యపై జగన్ వర్గం ప్రారంభించిన దాడిగానే స్పష్టమవు తోంది.
ప్రకాశం జిల్లాలో జరుగుతున్న జగన్ ఓదార్పు యాత్ర ముఖ్యమంత్రి రోశయ్యను ధిక్కరించే వేదికగా మారుతోంది. గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాను రోశయ్యను ముఖ్యమంత్రిగా పరిగణించడం లేదని, తనకు కాంగ్రెస్ వల్ల కాకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే మంత్రి పదవి వచ్చిందని చెప్పకనే చెప్పడం సంచలనం సృష్టించింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వైఎస్ ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు అమలుకావన్న పరోక్ష వ్యాఖ్యలు చర్చనీ యాంశంగా మారాయి. ఇవి తిరుగుబాటు దిశగా సాగుతున్న ఆలోచన లుగానే సీని యర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్‌కు మద్దతుదారుగా ఉన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఓదార్పు ఇకపై ధిక్కారయాత్రగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ వెంట ఉన్న వారిపై వేటు వేయడం ద్వారా, జగన్‌ను నిర్వీర్యం చేయాలన్న అధిష్ఠానం ఆలోచనను పసిగట్టిన ఆయన అనుచరులు, దేనికయినా సిద్ధంగా ఉన్నామన్న తెగింపు సంకేతాలు బాలినేని వ్యాఖ్యల బట్టి స్పష్టమ వుతున్నాయి. ‘నా పదవి పోయినా ఫర్వా లేదు. జగన్ మాత్రం సీఎం కావాల’ని బాలి నేని విస్పష్టంగా వ్యాఖ్యానించడం బట్టి.. జగన్ అనుచరులయిన మంత్రులు, ఎమ్మె ల్యేలు ఎంతవరకూ తెగించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతోంది. గతంలో మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి కూడా ఇలాగే కనిపించింది.
ప్రజలు రోశయ్యను ముఖ్యమంత్రిగా చూడ లేకపోతు న్నారని, తాను ఆయన ముఖం చూడలేకపోతున్నానంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆమె మంత్రివర్గం నుంచి వైదొలగారు. ఇప్పుడు బాలినేని వ్యవహారశైలి అదేవిధంగా ఉన్నప్పటికీ.. తనను ముఖ్యమంత్రే తొలగించాలన్న ధోరణి ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. కాంగ్రెస్ నాయకత్వం తమపై ఎందాకా వెళుతుందో చూసే వైఖరిని జగన్ వర్గం ప్రదర్శి స్తోంది. లేకపోతే ఇంకా మంత్రిగా కొనసాగుతున్న బాలినేని, ముఖ్యమంత్రిపై అంతఘాటు వ్యాఖ్యలు చేయలేరని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కాగా.. తూర్పు గోదావరి జిల్లా యాత్రలో జన సమీరకణకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని జగన్ వర్గం, ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టగానే తన వ్యూహం పూర్తిగా మార్చుకుంది. భారీ జన సమీకరణపెనేై ప్రధానంగా దృష్టి సారించింది. ద్వితీయ స్థాయి నేతలను సమీకరించి, కింది స్థాయి కార్యకర్తలను రోడ్లపై నింపే వ్యూహానికి తెరలేపారు. వైఎస్ బంధువు వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో, మంత్రి బాలినేని స్వీయ దర్శకత్వంలో తరలింపు వ్యవహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు జనసమీకరణ స్పష్టం చేస్తోంది.
ప్రకాశం జిల్లాలో జగన్ యాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకూ మునుపటి మాదిరిగానే ఎక్కడా సోనియా ప్రస్తావన గానీ, పార్టీ పలుకు గానీ వినిపించకపోవడం ప్రస్తావనార్హం.
పార్టీ పేరు, అధ్యక్షురాలు సోనియాగాంధీ సమర్థతను ప్రస్తావించాలని మొయిలీ విధించిన షరతులు ఓదార్పు యాత్రలో ఎక్కడా కనిపించకపోవడం బట్టి.. పూర్తిగా తెగించడానికే సిద్ధమయినట్లు జగన్ వ్యవహారశైలి చెప్పకనే చెబుతోంది. జగన్ తన యాత్రలో చేస్తున్న ప్రసంగాల్లో తండ్రి వైఎస్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు, తన గురించి చెప్పుకోవడానికే పరిమితమవుతున్నారు. కాగా జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా ఆయన ఆవిష్కరిస్తున్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు, వాటిని ఏర్పాటుచేసే ద్వితీయ శ్రేణి నేతలకు గిరాకీ పెరిగింది. విగ్రహంతో పాటు.. అవి ఏర్పాటు చేసే నాయకులకు లక్ష రూపాయల చొప్పున నగదు ఇస్తుండటంతో నేతల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా.. అరి లోమీటరులో రెండేసి విగ్రహాలు వెలుస్తున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఇక వీటికి అనుమతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అటు మునిసిపాలిటీలు గానీ, ఇటు పంచాయతీలు గానీ ఎవరూ అభ్యంతరం పెట్ట పోవడంతో విగ్రహాల ఏర్పాటు కోసం నేతల మధ్య పోటీ పెరిగింది.




